డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ను కలిసిన నిఖత్ జరీన్‌‌‌‌..

డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ను కలిసిన నిఖత్ జరీన్‌‌‌‌..
  • డీఎస్పీగా అవకాశమివ్వడంపై కృతజ్ఞతలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్, నూతనంగా డీఎస్పీగా నియమితులైన నిఖత్ జరీన్ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు డీఎస్పీగా అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకాన్ని తనకు దక్కిన గొప్ప గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నానని నిఖత్ జరీన్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్.. నిఖత్ జరీన్ సాధించిన విజయాలను అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎనలేని గౌరవాన్ని తీసుకువచ్చారని ఆమెను ప్రశంసించారు.