న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాల వివాదంపై మంగళవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. భోజ్‌శాలను ఆలయంగా పేర్కొన్న మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై ముస్లిం వర్గాల అప్పీల్‌ను విచారణకు స్వీకరించింది. ఇది చాలా సున్నితమైన అంశమని, ఇరు వర్గాలు సంయమనం పాటించాలని కోర్టు సూచించింది. అయితే, భోజ్‌శాల ప్రాంగణంలో నమాజ్ చేసేందుకు అనుమతివ్వలేదు. బదులుగా ప్రతి శుక్రవారం మధ్యాహ్నం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో నమాజ్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్కడ ఎలాంటి నిర్మాణ మార్పులు చేయొద్దని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కు సూచించింది.
