ఎల్ నినో ప్రభావంతో వానలు ముఖం చాటేశాయి. ఇప్పటికే దుక్కులు దున్ని, విత్తనాలు వేసిన రైతులు వరుణుడి కోసం ఎదురుచూస్తున్నారు. వాన పడకపోవడంతో వేసిన విత్తనాలు వేసినట్లే మాడిపోతున్నాయి. దీంతో వరుణుడు కరుణించాలని, వర్షాలు కురవాలని కోరుతూ ఖమ్మం జిల్లా వి.వెంకటయ్యపాలెం రైతులు మంగళవారం బొడ్రాయికి ఇలా జలాభిషేకం చేశారు.
