జులై15న పాలమూరులో సీఎం పర్యటన..దివిటిపల్లిలో సెల్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం

జులై15న  పాలమూరులో సీఎం పర్యటన..దివిటిపల్లిలో సెల్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం
  •     కొత్తకోటలో గర్ల్స్ స్కూల్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

మహబూబ్ నగర్​/వనపర్తి, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.45 వరకు రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్​సిటీలో అమెజాన్​డేటా సెంటర్​ గ్రౌండ్​బ్రేకింగ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం 1.20 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమరరాజా కారిడార్ లో సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ ను ప్రారంభించిన అనంతరం అక్కడ మాట్లాడనున్నారు.

 2.45 గంటలకు కొత్తకోట పట్టణానికి చేరుకొని గర్ల్స్ స్కూల్ ను ప్రారంభించిన అనంతరం 9, 10 తరగతుల స్టూడెంట్లతో ఇంటరాక్ట్ అవుతారు. అనంతరం మధ్యాహ్నం 3.45 గంటలకు కొత్తకోట నుంచి హెలికాప్టర్ లో హైదరాబాద్​కు తిరుగుపయనం అవుతారు. 

సీఎం పర్యటన నేపథ్యంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మంగళవారం సీఎం స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్లు, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీత రెడ్డితో సమావేశం నిర్వహించారు. ఆఫీసర్లు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్తకోట పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు ఎస్పీ సునీతరెడ్డి ప్రకటించారు.

 బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాహనాల మళ్లింపు అమల్లో ఉంటుందన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్ కుమార్, సీఎం సెక్యూరిటీ ఇన్ చార్జి శ్రీధర్ పాల్గొన్నారు.

భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం వద్దు : ఎస్పీ జానకి, మహబూబ్ నగర్

సీఎం పర్యటన నేపథ్యంలో ప్రతిఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వర్తించాలని మహబూబ్ నగర్​ఎస్పీ జానకి ఆదేశించారు. వీఐపీల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, సమావేశ ప్రాంగణం తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించే సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సీఎం పర్యటన బందోబస్తు డ్యూటీలో మొత్తం 450 మంది పోలీసులను వినియోగిస్తున్నట్లు చెప్పారు.