ఇవాళ (జులై 16) భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మంత్రుల పర్యటన

ఇవాళ (జులై 16) భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మంత్రుల పర్యటన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. అశ్వాపురం మండలంలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పరిశీలించి, రివ్యూ నిర్వహించనున్నారు. 

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో యాతాల కుంట వద్ద సీతారామ టన్నెల్ పనులను పరిశీలన, కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్ పరిధిలోని కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.