మెదక్ జిల్లాలో పకడ్బందీగా సర్..ఇప్పటి వరకు 67.08 శాతం నమోదు

మెదక్ జిల్లాలో  పకడ్బందీగా సర్..ఇప్పటి వరకు  67.08 శాతం నమోదు
  •    కలెక్టర్ ప్రతిమాసింగ్

మెదక్​ టౌన్​, వెలుగు :  మెదక్ జిల్లా వ్యాప్తంగా  సర్  ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 67.08 శాతం నమోదు పూర్తయిందని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. బీఎల్ఓలు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ఇంటింటి సర్వే, ఫీల్డ్ వెరిఫికేషన్, దరఖాస్తుల పరిశీలన వంటి ప్రతి దశను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని సూచించారు.