అర్హులైన వారు ఓటు హక్కును కోల్పోవద్దు..తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌‌పర్సన్ జి.వి. వెన్నెల

అర్హులైన వారు ఓటు హక్కును కోల్పోవద్దు..తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌‌పర్సన్ జి.వి. వెన్నెల

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ బూత్ ఏజెంట్లు, నాయకులు, కార్యకర్తలపై ఉందని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌‌పర్సన్, మెదక్ పార్లమెంట్ ‘సర్’  కోఆర్డినేటర్ జివి వెన్నెల అన్నారు. బుధవారం సిద్దిపేట కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 

సర్  ప్రక్రియపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఓట్లు పోయే  ప్రమాదం ఉందని హెచ్చరించారు.   రాష్ట్రంలో కాంగ్రెస్ ఓట్లను తొలగించేందుకు విపక్షాలు కుట్రలు చేసే అవకాశం ఉన్నందున ఎన్యూమరేషన్​ ఫారాల నమోదులో ఓటర్లకు సహాయం చేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిద్దిపేట ప ట్టణంలో సర్ ప్రక్రియ గురించి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి పూజల హరికృష్ణ వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాదగిరి, లక్ష్మి, రశీద్‌‌‌‌, వహబ్, అంజిరెడ్డి, మార్క సతీశ్​పాల్గొన్నారు.