బునియా: ఆఫ్రికాలోని కాంగో దేశంలో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 2,011 కేసులు నమోదు కాగా, 754 మంది మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం 753 మంది దవాఖానల్లో, ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతుండగా, 366 మంది కోలుకున్నారు. అయితే హెల్త్ వర్కర్లకు జీతాలు ఆలస్యం కావడంతో కొందరు సమ్మె చేశారు. దీంతో పరిస్థితి కష్టంగా మారింది. వ్యాధి సోకిన వారితో కలిసిన వాళ్లను గుర్తించే కాంటాక్ట్ ట్రేసింగ్ కేవలం 67% మాత్రమే పూర్తైంది. దీంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం సవాల్‌గా మారిందని అధికారులు చెబుతున్నారు.
