- కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్లు, టెక్నీషియన్ల నియామకం
హైదరాబాద్, వెలుగు: సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 240 పోస్టులను కాంట్రాక్ట్, గౌరవ వేతన ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు 2027 మార్చి 31, వరకు లేదా రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యే వరకు అమల్లో ఉంటాయి. ఖాళీల్లో అత్యధికంగా 144 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, 14 ఫార్మాసిస్ట్ గ్రేడ్-2, 48 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, 12 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-1, 6 మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్-2, 16 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
