పుణె: పుణెలోని ఫుర్సుంగి ప్రాంతంలో ఒక గిడ్డంగిలో నకిలీ టాటా సాల్ట్ ప్యాకెట్లను నిల్వ చేశారన్న ఆరోపణలపై వ్యాపారవేత్త ధవల్ జైన్‌పై ఫుర్సుంగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఫుర్సుంగి–హడప్సర్ రోడ్డులోని గిడ్డంగిలో నకిలీ టాటా సాల్ట్ ఉత్పత్తులను అమ్మకం కోసం నిల్వ చేశారని ఆరోపిస్తూ కృష్ణ దేవిప్రసాద్ కనోజియా అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు.
జూలై 14న పోలీసులు గోదాంలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో.. టాటా బ్రాండ్ పేరుతో ఉన్న నకిలీ ప్యాకెట్లను పోలీసులు కనుగొన్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS), కాపీరైట్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఈ నకిలీ దందాకు పాల్పడిన వ్యాపారవేత్త ధవల్ జైన్‌పై కేసు నమోదు చేశారు.
Fursungi Police have registered a case against businessman Dhaval Jain for allegedly storing counterfeit Tata Salt packets at a warehouse in Pune's Fursungi area. The complaint was filed by Krishna Deviprasad Kanojia, who alleged that fake Tata Salt products were stocked for sale… pic.twitter.com/UeI7YzRRM3
— Pune Mirror (@ThePuneMirror) July 16, 2026
టాటా సాల్ట్ బ్రాండింగ్‌ను పోలి ఉండే నకిలీ ప్లాస్టిక్ సంచులలో చౌకైన, నాణ్యత లేని, అయోడైజ్ చేయని లోకల్ ఉప్పును ఈ నకిలీ బ్యాచ్ ప్యాక్ చేసి దుకాణాలకు సప్లై చేస్తారు. తక్కువ ధరకు ఇస్తుండటంతో.. దుకాణదారులు కూడా ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి ఈ ఉప్పునే ఒరిజినల్ కాదని తెలిసినా వినియోగదారులకు అమ్ముతున్నారు.
►ALSO READ | కలర్ పాపడ్లు తింటున్నరా..? బ్యాన్ చేసిన విజయ్ సర్కార్.. ఎందుకంటే..
ఈ ఉప్పును కూరల్లో వేసుకుని, పెరుగన్నం వేసుకుని తినడం వల్ల.. థైరాయిడ్ సమస్యలు, తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే.. ఈ అనారోగ్య సమస్యలకు కారణం ఉప్పు అనే విషయం చాలా మంది గ్రహించలేకపోవడం వల్ల ఈ కల్తీ గాళ్ల ఆటలు సాగుతున్నాయి. ఈ మధ్య మహారాష్ట్రలోని పుణె నగరం కల్తీకి అడ్డాగా మారింది. నిన్నమొన్న పాలు కూడా కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో మరీ ముఖ్యంగా చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు FDA తనిఖీల్లో వెల్లడైంది.
