అమ్మో.. ఎంత పని చేశావ్ చిట్టి తల్లి.. అసలు మీ అమ్మానాన్నను అనాలి !

అమ్మో.. ఎంత పని చేశావ్ చిట్టి తల్లి.. అసలు మీ అమ్మానాన్నను అనాలి !

చిక్ బళ్లాపూర్: పిల్లలను ఒక వయసు వచ్చేంత వరకూ ఓ కంటకనిపెడుతూ ఉండాలి. పిల్లలను వాళ్ల మానాన వాళ్లను వదిలేసి మనం పనుల్లో, ఇతరత్రా షాపింగుల్లో మునిగిపోతే జరగరాని ఘటనలు జరుగుతాయి. పిల్లల ప్రాణాలు పోయాక మనం ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. ఆ ఒక్క క్షణం కనిపెట్టుకుని ఉంటే బాగుండేదని బాధపడినా పోయిన పసి ప్రాణం తిరిగి రాదు. పిల్లలను అలా వదిలేస్తే తెలిసీతెలియక వాళ్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారని మరోసారి రుజువు చేసే ఘటన చిక్ బళ్లాపూర్లో జరిగింది. అయితే.. అదృష్టవశాత్తూ పాప ప్రాణాలతో బయటపడింది.

చిక్ బళ్లాపూర్లో తల్లిదండ్రులు షాపింగ్ చేస్తుండగా.. బయట ఉన్న రెయిలింగ్ ఎక్కిన మూడేళ్ల బాలిక 12 అడుగుల ఎత్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడింది. ఈ ఘటనలో చిన్నారి తలకు గాయమైంది. అయితే.. పాప ప్రాణాలతో బయటపడటంతో తల్లిదండ్రులకు ప్రాణం లేచొచ్చినట్లయింది. బెంగళూరులోని ఆస్టర్ సీఎంఐ ఆసుపత్రిలో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. పిల్లలు మెట్లు, బాల్కనీలు, తెరిచి ఉంచిన కిటికీల దగ్గర ఆడుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు ఓ కంటకనిపెడుతూ ఉండకపోతే ఇలాంటి ఘటనలే జరుగుతాయి.

►ALSO READ | పాపం ఈ అమ్మాయి.. బస్టాండ్లో బస్ కోసం చూస్తుంటే ఎక్కడ నుంచి వచ్చిండో వచ్చిండు !