డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిలో ఏ ముహూర్తాన కూర్చున్నాడో కానీ.. ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు.. అటు యుద్ధం అంటాడు.. ఇటు మైగ్రెంట్స్ బ్యాన్ అంటాడు.. అప్పుడే ఫ్రెండ్ అంటాడు.. అప్పుడే కయ్యానికి కాలు దువ్వుతాడు.. ముందు ముందు ఎలా ఉంటుందోరా నాయనా.. ఇవి కాస్త అంతర్జాతీయ పరిణామాలపై అవగాహన ఉన్న వాళ్ల మాటలు. ఇండియన్ మైగ్రెంట్స్ పై మొదటి నుంచీ కన్నేసిన ట్రంప్.. ఇప్పటికే చేయాల్సిందంతా చేశాడు. లేటెస్టుగా.. గ్రీన్ కార్డు అప్లై చేసుకునే వారికి మరో భారీ షాక్ ఇస్తూ కొత్త నిబంధనలు తీసుకొచ్చాడు.
అమెరికా గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసుకునే వారు $100,000 (లక్ష డాలర్లు) వరకు బాండ్‌ను సమర్పించాల్సి వచ్చేలాట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తోంది . అంటే 96 లక్షల రూపాయలు.. అంటే దాదాపు కోటి రూపాయలు. పైలట్ కార్యక్రమం కింద అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునే వలస వీసా అప్లికెంట్స్ కోసం కొత్త నిబంధనను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయనప్పటికీ, త్వరలో కార్యరూపం తీసుకురానున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
గ్రీన్ కార్డ్ బాండ్ అంటే ఏమిటి?
విదేశాల్లోని అమెరికన్ కాన్సులేట్‌ల ద్వారా ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే కొంతమంది దరఖాస్తుదారులు, ఆమోదం పొందే ముందు ఫైనాన్షియల్ గ్యారెంటీ డిపాజిట్ చేయాలనే నిబంధనను తీసుకురానున్నారు. మైగ్రెంట్ వీసాలు పొందినవారు, పర్మనెంట్ యూఎస్ సిటిజన్ షిప్ పొందాలంటే గ్రీన్ కార్డ్ అనుమతిస్తుంది.
ముఖ్య లక్షణాలు:
దరఖాస్తుదారులు $100,000 వరకు గ్యారెంటీ సమర్పించాల్సి ఉంటుంది.
ఈ కార్యక్రమాన్ని తొలుత లిమిటెడ్ సంఖ్యలో కొన్ని దేశాల్లో అమలు చేస్తారు.
ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్న కుటుంబ సభ్యులు అప్లికెంట్స్ కు తరపున గ్యారెంటీ సమర్పించవచ్చు.
వ్యక్తి అమెరికా పౌరసత్వం పొందిన తర్వాత బాండ్ వాపస్ ఇస్తారు. అంటే చెల్లించిన లక్ష డాలర్లు తిరిగి ఇస్తారు.
పైలట్ కార్యక్రమంలో ఏ దేశాలలో ఇంప్లిమెంట్ చేస్తారో ఇంకా ప్రకటించలేదు.
ఇండియన్స్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..?
ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ వీసా కేటగిరీల కింద వెళ్లిన ఇండియన్స్.. అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ఇప్పటికే నిరీక్షిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ ప్రతిపాదన రావటం ఆందోళన కలిగించే అంశం.యూఎస్ గ్రీన్ కార్డ్ కోరుకునే స్కిల్ డ్ పీపుల్ లో ఇండియా నుంచే ఎక్కువగా ఉంటారు.
అమెరికా ఏటా సుమారు లక్ష 40 వేల ఎంప్లాయ్మెంట్ గ్రీన్ కార్డ్‌లను మంజూరు చేస్తుంది. అయితే, దేశాల వారీగా ఉన్న పరిమితి కారణంగా, ఏ ఒక్క దేశమూ ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం కేటాయింపులో 7 శాతం కంటే ఎక్కువ పొందలేదు. దీనివల్ల, సంవత్సరానికి ఇండియా వాటా సుమారు 9 వేల 800 వీసాలకు మాత్రమే పరిమితమైంది.
►ALSO READ | మయన్మార్ తీరంలో మునిగిపోయిన రెండు రోహింగ్యా శరణార్ధుల పడవలు...500 మందికి పైగా మృతి..!
ఇండియన్ ప్రొఫెషనల్స్ నుండి ఉన్న డిమాండ్ ఈ కోటాను మించిపోవడంతో, ఏండ్లకు తరబడి భారీగా పెండింగ్ లోనే ఉన్నాయి. ప్రైమరీ అప్లికెంట్స్, వారి పార్టనర్స్, వారిపై ఆధారపడిన పిల్లలతో సహా పది లక్షలకు పైగా భారతీయ పౌరులు ప్రస్తుతం ఎంప్లాయ్ మెంట్ గ్రీన్ కార్డ్ క్యూలో వేచి ఉన్నారు.
ఇది ఇంప్లిమెంట్ అయితే అనేక కుటుంబాలపై ఆర్థిక భారం పడనుంది. ఎంప్లాయ్ మెంట్ గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్ కారణంగా ఇప్పటికే ఎందరో వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. అలాంటి వారికి ఈ నిబంధన మరింత సవాలుగా మారవచ్చని నిపుణులు అంటున్నారు.
