హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగింది. మైనర్ ను గ్యాంగ్ రేప్ చేసి పరారయ్యారు నలుగురు దుర్మార్గులు. బాలిక స్కూల్ కు వెళ్తుండగా ఈ దారుణానికి ఒడిగట్టారు నలుగురు కీచకులు. బుధవారం (జులై 15) జరిగిన ఈ ఘటన హైదరాబాద్ వ్యాప్తంగా కలకలం రేపింది.
హైదరాబాద్ సనత్ నగర్ జరిగింది ఈ ఘటన. బుధవారం ఉదయం బాలిక స్కూల్ కు వెళ్తుండగా షాబాజ్ అనే నిందితుడు బైక్ పై ఫాలో అయ్యాడు. బాలికను వెంబడించి బైక్ పై ఎక్కించుకున్న నిందితుడు.. సనత్ నగర్ జిహెచ్ఎంసి పార్క్ లోకి తీసుకెళ్లాడు.
►ALSO READ | వాడు ఇంత ప్రశాంతంగా చావడమేంటి సర్..? షాబాద్ ఆరు హత్యల నిందితుడి అన్న కామెంట్స్
ఆ తర్వాత కాంప్లెక్స్ నుంచి ఆటోలో షాబాజ్ ఇంటికి తీసుకెళ్లాడు మరో స్నేహితుడు రఫిక్. శభాష్, రఫిక్ తో పాటు మరో ఇద్దరు నిందితులు కలిసి బాలికపై గ్యాంగ్ రేప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేశారు సనత్ నగర్ పోలీసులు. BNS 137(2), 65(1), sec 5 r/w 6 of pocso act కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.
