మయన్మార్ తీరంలో మునిగిపోయిన రెండు రోహింగ్యా శరణార్ధుల పడవలు...500 మందికి పైగా మృతి..!

మయన్మార్ తీరంలో మునిగిపోయిన రెండు రోహింగ్యా శరణార్ధుల పడవలు...500 మందికి పైగా మృతి..!

మయన్మార్ సముద్ర తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోహింగ్యా శరణార్థులు ప్రయాణిస్తున్న రెండు పడవలు మునిగిపోవడంతో 500 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. జూన్ నెలాఖరులో రెండు పడవలు మయన్మార్ నుండి బయలుదేరాయని.. వీటిలో రోహింగ్యా మైనారిటీ వర్గాలకు చెందిన ప్రయాణికులు ఉన్నారని తెలిపారు అధికారులు. వీరు బాంగ్లాదేశ్ లోని శరణార్థి శిబిరాల నుండి వచ్చినట్లు తెలిపారు అధికారులు. ఈ క్రమంలో రెండు పడవలు బోల్తా పడి 500 మందికి పైగా మృతి చెందినట్లు తెలిపారు ఐక్యరాజ్యసమితి అధికారులు.

బాంగ్లాదేశ్ లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న క్రమంలో శరణార్థి శిబిరాల నుండి తరిమేయబడ్డ రోహింగ్యా ముస్లింలు మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్ వంటి దేశాలకు వెళ్లే ప్రయత్నంలో పాత చెక్క పడవలపై ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణిస్తున్నారని తెలిపారు ఐక్యరాజ్య సమితి అధికారులు.

గత సంవత్సరం అండమాన్, బంగాళాఖాతంలో దాదాపు 900 మంది రోహింగ్యా శరణార్థులు మరణించారని... శరణార్థులకు ఈ సముద్రమార్గం అత్యంత ప్రమాదకరమైందిగా మారిందని అంటున్నారు. 

ప్రమాదపు అంచున ప్రయాణం:

ఈ ఘటనలో 250 మంది ప్రయాణిస్తున్న పడవ బయలుదేరిన కొద్దిసేపటికే గల్లంతయ్యిందని... 280 మందితో ప్రయాణిస్తున్న రెండో పడవ జులై 8న మయన్మార్ ఇరావడి తీరంలో మునిగిపోయిందని తెలిపారు అధికారులు.

మయన్మార్ సైన్యం సరిహద్దు ప్రావిన్స్‌లో దాడి ప్రారంభించిన తర్వాత 2017లో రఖైన్ నుండి రోహింగ్యాల వలస ప్రారంభమైంది, దీని ఫలితంగా కనీసం 7లక్షల 30 వేల బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందారు. మయన్మార్ రోహింగ్యాలను అక్రమ వలసదారులు అని పేర్కొంటూ వారిని పౌరులుగా గుర్తించడానికి నిరాకరిస్తోంది బాంగ్లాదేశ్ ప్రభుత్వం.

►ALSO READ | ఓరి దేవుడా.. న్యూజిలాండ్లో భూకంపం.. ఆ వెంటనే సునామీ వార్నింగ్