హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా రేషన్ బియ్యం పట్టుకున్నారు. బియ్యం తరలిస్తున్న ఐదుగురు ముఠాను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ, చెకింగ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ నిందితులు తరలిస్తున్న 220 టన్నుల రేషన్ బియ్యం, 40 బ్యాగుల గోధుమలు పట్టుకున్నారు. బియ్యన్ని తరలిస్తున్న KA56 5397 లారీ, TS08UH9222, ,TG31T1655, ,TS11UD4966.TS 13 T 2369 నాలుగు టాటా ఏసీ బండ్లను సీజ్ చేశారు.
పట్టుకున్న బియ్యం విలువ సుమరు 4 లక్షల 50 వేలు ఉండొచ్చని అధికారులు చెప్పారు. ఒక లారీ, 4 టాటా ఏస్ వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గౌలి దొడ్డి నుంచి కర్ణాటకకు బియ్యం తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. కంట్రోల్ యాక్ట్ 2016 కింద కేసు నమోదు చేశారు. నిందితులను గచ్చిబౌలి పోలీసులకు విజిలెన్స్ అధికారులు అప్పచెప్పారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
►ALSO READ | దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ కేసుల్లో... 44 శాతం తెలంగాణలోనే: డీజీపీ సీవీ ఆనంద్
