SamanthaRaj: చిత్తూరులో సమంత సీమంతం వేడుకలు... తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమైన సామ్!

SamanthaRaj: చిత్తూరులో సమంత సీమంతం వేడుకలు... తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమైన సామ్!

టాలీవుడ్ గ్లామర్ క్వీన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన జీవితంలోనే మరో అదమైన, మధురమైన క్షణాలను ఆస్వాదిస్తోంది. త్వరలోనే తల్లికాబోతున్న సామ్ తన మొదటి బిడ్డను ఆహ్వానించేందుకు ఉత్సాహంగా సిద్ధమవుతోంది. లేటెస్ట్ తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సీమంతం జరుపుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఎంతో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతన్నాయి.

ఈ వేడుకపై సమంత దంపతులు అధికారికంగాఎలాంటి ప్రకటన చేయకపోయినా... బయటకు వచ్చిన ఫొటోలు నెట్టింట సంచలనంగా మారాయి. అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ సీమంత వేడుకుల్లో అత్తగారితో సామ్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఈ వేడుకలో సమంత సంప్రదాయ దుస్తుల్లో , తక్కువ ఆభరణాలు, సహజమైన మేకప్‌తో మరింత అందంగా మెరిసిపోయారు. రాజ్ నిడిమోరు కూడా మరూన్ సిల్క్ కుర్తా, తెలుపు రంగు ప్యాంట్‌లో సమంతకు జోడీగా ఆకట్టుకున్నారు. ఇద్దరి ముఖాల్లో ఆనందం  కనిపించింది. చిత్తూరులోని అత్తగారి ఇంట్లో ఈ వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది.

గత ఏడాది కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న ఈ జంట, ఈ ఏడాది తమ తొలి బిడ్డకు స్వాగతం పలకబోతోంది. ‘మా ఇంటి బంగారం’ సినిమా విజయోత్సవ వేడుకల్లోనే సమంత తన గర్భధారణ విషయాన్ని అభిమానులతో పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటి నుంచి గర్భధారణకు సంబంధించిన తన అనుభవాలు, ఆరోగ్య సంరక్షణ, భావోద్వేగ క్షణాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ వస్తోంది.

►ALSO READ | Gedela Raju OTT: ఓటీటీలోకి రఘు కుంచె క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇక కెరీర్ విషయానికి వస్తే నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగు సినీ చరిత్రలో తొలి మహిళా ప్రధాన పాత్ర చిత్రంగా సమంత రికార్డు సృష్టించారు. సమంత, రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి నిర్మాతలుగా కూడా వ్యవహరించారు. గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జూలై 17 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ప్రస్తుతం నటనకు కొంత విరామం ఇచ్చిన సమంత, మాతృత్వాన్ని ఆస్వాదించిన తర్వాత'మా ఇంటి బంగారం' సీక్వెల్‌తో పాటు 'రక్త బ్రహ్మాండ: ది బ్లడీ కింగ్‌డమ్' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా, సీమంతం వేడుకపై అధికారిక ప్రకటన రాకపోయినా అభిమానులు, సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా ఈ దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారి జీవితంలోకి రానున్న కొత్త అతిథికి ప్రేమాభిమానాలతో స్వాగతం పలుకుతున్నారు.