సంగీత దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రఘు కుంచె, నటుడిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన రీసెంట్ మూవీ ‘గేదెల రాజు’. చైతన్య మోటూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మర్డర్ మిస్టరీతో తెరకెక్కింది. ‘‘చూస్తే ఒకటే నిజం.. చూడకపోతే వంద అనుమానాలు’’ అనే ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగానే, ఈ మూవీ రూపొందింది. ఇపుడు ఈ రూరల్ రస్టిక్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి రానుంది. ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం జూలై 17 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
స్టోరీ బ్యాక్డ్రాప్..
కాకినాడ కేంద్రంగా సాగే ఈ కథలో గేదెల రాజు (రఘు కుంచె) ఒక పవర్‌ఫుల్ రౌడీ షీటర్. కేవలం సెటిల్‌మెంట్లకే పరిమితం కాకుండా, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయాల్లో చక్రం తిప్పాలని కలలు కంటాడు. అతనికి స్థానిక ఎమ్మెల్యే అండదండలు కూడా తోడవుతాయి. అయితే అదే టికెట్‌ను ఆశిస్తున్న దుర్గ (శ్రీకాంత్ అయ్యంగార్), రాజుకు ప్రధాన శత్రువుగా మారతాడు. వీరి మధ్య రాజకీయ పోరు నడుస్తుండగానే, ఒక రాత్రి గేదెల రాజు దారుణంగా హత్యకు గురవుతాడు.
►ALSO READ | Urmila Adinath: భార్యకు విడాకులు ఇచ్చిన 'రామాయణ' నటుడు.. 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు!
ఈ మర్డర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకు సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతాయి. దుర్గ మీద అనుమానం ఉన్నా, ఆధారాలు దొరకవు. మరోవైపు రాజు తమ్ముడు శ్యాంబాబు ప్రవర్తన కూడా అనుమానాస్పదంగానే ఉంటుంది. అసలు రాజును చంపింది ఎవరు? ఈ కథలోకి రిచ్-మీరా, విజయ్-సత్య అనే జంటలు ఎలా వచ్చారు? వీరందరికీ రాజు హత్యతో ఉన్న లింక్ ఏంటి? అనే ఉత్కంఠభరిత అంశాలతో సినిమా సాగుతుంది.
#TMSRUpdates #TMSRUOTTUpdates 📱
— TMSRUpdates ❁ (@TMSRUpdates) July 16, 2026
A murder that shook Kakinada.
A list of suspects with secrets.
And one question that demands an answer… 👀
Who killed #GedelaRaju
Streaming from July 17, only on @ahavideoIN#MoturiChaitanya #RaghuKunche#SekharKumpatla #VRaju pic.twitter.com/ouML3r5Lh5
రఘు కుంచె విశ్వరూపం..
ఈ సినిమాకు అసలైన బలం, ప్రాణం రఘు కుంచె. ఒక రౌడీ షీటర్‌గా ఆయన మేకోవర్, బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి యాసలో ఆయన పలికించిన డైలాగులు థియేటర్లో ఈలలు వేయిస్తాయి. ఒక వైపు కరుడుగట్టిన రౌడీగా కనిపిస్తూనే, మరోవైపు రాజకీయ ఆకాంక్షలు ఉన్న వ్యక్తిగా ఆయన చూపిన హావభావాలు సినిమాను నిలబెట్టాయి. రఘు కుంచె కెరీర్‌లో ఇది ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు.
