మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. డిప్యూటీ తహసీల్దార్ ఆఫీస్ రూమ్ పై కొందరు ఆగంతకులు రాళ్లు విసరడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. గురువారం (జులై 16) డిప్యూటీ తహసీల్దార్ తన చాంబర్‌లో విధుల్లో ఉన్న సమయంలోనే దాడి జరగటం భయాందోళనకు గురిచేసింది.
కార్యాలయంపై దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు. ఎమ్మార్యో ఆఫీసుకు చేరుకున్న పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు.
►ALSO READ | లక్షలు ఖర్చు చేసినా, దాతలు సాయం చేసినా దక్కని ప్రాణాలు
రాళ్ల దాడి చేసిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. దాడి చేసిన వ్యక్తి కదలికలను పోలీసులు పరిశీలించారు. దాడి చేసి పారిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుండటంతో వ్యక్తి ఎవరనేదానిపై ఆరా తీస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడి చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. త్వరలోనే నిందితుడిని పట్టుకోనున్నట్లు తెలిపారు. మరోవైపు దాడి జరిగిన క్రమంలో.. ఎమ్మార్వో కార్యాలయం దగ్గర పోలీసుల భద్రత పెంచారు.
