లక్షలు ఖర్చు చేసినా, దాతలు సాయం చేసినా దక్కని ప్రాణాలు

లక్షలు ఖర్చు చేసినా, దాతలు సాయం చేసినా దక్కని ప్రాణాలు

కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన వేల్పుల అరవింద్ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. నెల రోజుల క్రితం పోరండ్ల గ్రామ శివారులో బైకు అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. మొదట కరీంనగర్, అనంతరం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో నెల రోజుల పాటు చికిత్స చేశారు.

లక్షల రూపాయలు ఖర్చు చేసినా, దాతలు సహాయం చేసినా ప్రాణాలు దక్కలేదు. ఓ వైపు చదువుకుంటూనే కుటుంబానికి ఆసరాగా అరవింద్ టీ స్టాల్‌లో పని చేస్తున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటగా, గొల్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.