టాస్ ఇంగ్లాండ్‌దే.. టీమిండియాకు ఫస్ట్ బ్యాటింగ్!

టాస్ ఇంగ్లాండ్‌దే.. టీమిండియాకు ఫస్ట్ బ్యాటింగ్!

భారత్ vs ఇంగ్లండ్ మధ్య కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ప్రారంభం కాబోతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టాస్ ప్రక్రియ ముగిసింది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మొదట ఫీల్డింగ్ (Bowl First) తీసుకున్నాడు. పిచ్‌పై సమానంగా ఉన్న పచ్చిక (Grass) మరియు కార్డిఫ్ వాతావరణాన్ని వాడుకుని టీమిండియాను తక్కువ పరుగులకే కట్టడి చేయాలనేది ఇంగ్లాండ్ వ్యూహం. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్టులో రెండు మార్పులు చేయగా, భారత్ ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. 

భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. మేము టాస్ గెలిచినా మొదట బౌలింగే తీసుకునేవాళ్లం.. కానీ మొదట బ్యాటింగ్ చేయడానికి కూడా మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం.. తొలి వన్డేలో మేము ఒక పర్ఫెక్ట్ గేమ్ (Perfect Game) ఆడాం.. ముఖ్యంగా మా ఫాస్ట్ బౌలర్లు రాణించిన తీరు అద్భుతం.. కార్డిఫ్ మైదానంతో నాకు ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి.. ఈరోజు కూడా అదే జోష్‌తో మరోసారి సత్తా చాటి సిరీస్ సొంతం చేసుకుంటామని గిల్ ధీమా వ్యక్తం చేశాడు. కేఎల్ రాహుల్ కి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఇషాన్ కిషన్ కి తుది జట్టులో ఆడబోతున్నట్లు తెలిపాడు. 

ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రుక్ మాట్లాడుతూ.. పిచ్‌పై ఉన్న గ్రాస్ (Grass), కార్డిఫ్ వాతావరణాన్ని వాడుకుని టీమిండియాను తక్కువ పరుగులకే కట్టడి చేయడానికి రెడీ అయ్యాం.. గత మ్యాచ్‌తో పోలిస్తే ఈసారి తమ ఎగ్జిక్యూషన్ (Execution) మరింత పక్కాగా ఉంటుందని వెల్లడించాడు. ఈ డూ-ఆర్-డై మ్యాచ్ కోసం మేము జట్టులో రెండు మార్పులు చేసినట్లు బ్రుక్ ప్రకటించాడు.

►ALSO READ | లాస్ మాల్వినాస్ బ్యానర్‌తో అర్జెంటీనా.. ఫాక్‌లాండ్స్‌పై పాత గొడవ రీ-స్టార్ట్!

ఇరు జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ

ఇంగ్లాండ్: బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్