ఫ్లెమింగ్ ఎగ్జిట్.. సీఎస్కేకు కొత్త కోచ్ ఎవరు? తెరపైకి ధోనీ పేరును తీసుకొచ్చిన అశ్విన్!

ఫ్లెమింగ్ ఎగ్జిట్.. సీఎస్కేకు కొత్త కోచ్ ఎవరు? తెరపైకి ధోనీ పేరును తీసుకొచ్చిన అశ్విన్!

CSK Head Coach MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రస్థానం ముగియడంతో, ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఎల్లో ఆర్మీలో సరికొత్త చర్చ మొదలైంది. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ అందించిన ఫ్లెమింగ్, సీఎస్కే యాజమాన్యం పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో జట్టుకు కొత్త హెడ్ కోచ్‌గా ఎవరు వస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ధోనీయే పర్ఫెక్ట్ ఛాయిస్: 
సిఎస్కే జట్టుతో ఎంఎస్ ధోనీకి అపారమైన అనుభవం ఉందని రవిచంద్రన్ అశ్విన్ తెలిపారు. స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేయడానికి ధోనీ కంటే ఉత్తమమైన వ్యక్తి మరొకరు లేరని తేల్చి చెప్పాడు. చెన్నై ఫ్రాంచైజీలో ధోనీకి తిరుగులేని ఇమేజ్, టీమ్ సెలక్షన్, కీలక నిర్ణయాల్లో అతనికున్న పట్టు దృష్ట్యా కొత్తగా వచ్చే ఏ కోచ్‌కైనా ఒత్తిడి తప్పదన్నాడు. గత 17 ఏళ్లుగా ఫ్లెమింగ్-ధోనీ జోడి ఎంతో విజయవంతంగా సాగింది. ధోనీ మైండ్ సెట్‌ను ఫ్లెమింగ్ కరెక్ట్‌గా అర్థం చేసుకునేవాడు. ఇక ధోనీ గనుక కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంటే, సీఎస్కే మేనేజ్‌మెంట్ ఏమాత్రం ఆలోచించకుండా అతనికే పట్టం కట్టాలి.. ఒకవేళ ధోనీ కాదనుకుంటే, అతని ఇన్ఫ్లుయెన్స్‌కు లొంగకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగల ధీటైన వ్యక్తిని వెతకాలని ఆర్. ఆశ్విన్ వెల్లడించాడు. 

రేసులో హేమంగ్ బదానీ: 
ప్రస్తుతం స్టీఫెన్ ఫ్లెమింగ్ వారసుడిగా మాజీ భారత బ్యాటర్ హేమంగ్ బదానీ పేరు క్రికెట్ సర్కిల్స్‌లో విపరీతంగా ట్రెండ్ (Trend) అవుతోంది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కు హెడ్ కోచ్‌గా సేవలందిస్తున్న బదానీ వైపు సీఎస్కే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అయితే, బదానీ కోచింగ్, అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ 2025లో 5వ స్థానం, అలాగే ఐపీఎల్ 2026లో 6వ స్థానంతో సరిపెట్టుకుంది. సీఎస్కే మళ్లీ తన పూర్వ వైభవాన్ని అందుకోవాలని చూస్తున్న తరుణంలో, బదానీ రీసెంట్ ట్రాక్ రికార్డును యాజమాన్యం ఎంత వరకు పరిగణనలోకి తీసుకుంటుందో చూడాల్సి ఉంది. 

ముగిసిన ఫ్లెమింగ్ అద్భుతమైన లెగసీ: 
2008లో ఆటగాడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి, 2009 నుంచి సీఎస్కే హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రస్థానం నిజంగా ఒక స్వర్ణ యుగం (Golden Era) అని చెప్పాలి.. 17 ఏళ్ల సుదీర్ఘ కోచింగ్ కెరీర్‌లో చెన్నైని ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ కన్సిస్టెంట్ టీమ్‌గా నిలబెట్టాడు.

ALSO READ : భారత్ vs ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే.. 

* టైటిల్స్ రికార్డు: ఫ్లెమింగ్ ఆధ్వర్యంలో సీఎస్కే ఏకంగా 5 ఐపీఎల్ ట్రోఫీలు, 2 ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిళ్లను గెలుచుకుంది.

* ప్లేఆఫ్స్ రికార్డు: రికార్డు స్థాయిలో 12 సార్లు ప్లేఆఫ్స్‌కు చేర్చడమే కాకుండా, 10 సార్లు ఐపీఎల్ ఫైనల్స్ ఆడించిన ఘనత ఫ్లెమింగ్ దే.

* ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ లో ఒక సరికొత్త రీబిల్డింగ్ ఫేజ్ (Rebuilding Phase) స్టార్ట్ కాబోతోంది. మరి ఈ నయా ఎరాను లీడ్ చేయడానికి ధోనీ పగ్గాలు అందుకుంటాడా, లేక సరికొత్త కోచ్ ఎంట్రీ ఇస్తాడా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.