స్విగ్గీ నుంచి గ్యాస్ సిలిండర్ ఇన్స్టంట్ డెలివరీ.. స్టెప్ బై స్టెప్ బుకింగ్ ప్రాసెస్ !

స్విగ్గీ నుంచి గ్యాస్ సిలిండర్ ఇన్స్టంట్ డెలివరీ.. స్టెప్ బై స్టెప్ బుకింగ్ ప్రాసెస్ !

గ్యాస్ సిలిండర్ అయిపోయింది.. బుక్ చేస్తే ఒకటి రెండు రోజులు పడుతుంది.. కొన్ని సార్లు వారానికి పైగా టైమ్ తీసుకుంటుంది.. ఇప్పుడెలా.. పక్కింటి వారిని అడుగుదామా..? మనది వచ్చాక ఇవ్వచ్చు..? వాళ్లు ఇవ్వకుంటే ఏంటి పరిస్థితి..? రెంట్ కు తెచ్చుకోవాలా..? ఇలాంటి ప్రశ్నలకు, ఇబ్బందులకు ఇక ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఎప్పుడంటే అప్పుడు.. 24 గంటలు.. బిర్యానీ బుక్ చేసుకున్నంత ఈజీగా.. నిమిషాల్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిపోతుంది. ఈ ఇన్ స్టంట్ సర్వీస్ ఇచ్చేందుకు  క్విక్-కామర్స్ సంస్థ స్విగ్గీ.. డోర్‌స్టెప్ డెలివరీ ఎల్‌పిజి సిలిండర్ల సేవను ప్రవేశపెట్టింది.  అందుకోసం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో చేతులు కలిపింది. పైలట్ ప్రాజెక్ట్‌ గా  బుధవారం (జులై 15) బెంగళూరులో ఈ సర్వీస్ ప్రారంభం అయ్యింది. 

కస్టమర్స్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ యాప్ ద్వారా 5-కేజీ,  10-కేజీ ఎల్‌పిజి సిలిండర్లను ఆర్డర్ చేయవచ్చు.  అయితే దీనికి కొత్త కనెక్షన్ తీసుకోవాలా..? పాత కనెక్షన్ పరిస్థితి ఏంటి..? బుక్ చేసుకుంటే మళ్లీ ఎప్పుడు రిటర్న్ చేయాలి..? ఇలాంటి డౌట్స్ తో పాటు.. స్టెప్ బై స్టెప్ బుకింగ్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం.

 HP గ్యాస్ కనెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు:

సిలిండర్లను కొనేందుకు  హెచ్‌పి గ్యాస్ కనెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. అయితే, మొదటి సారి కొనేవారు  డెలివరీ సమయంలో ఐడెంటిటీ ప్రాసెస్  పూర్తి చేయాలి. కంపెనీలు ఇంకా సిలిండర్ల ధరలను వెల్లడించలేదు.

ప్రస్తుతం 5 కేజీల సిలిండర్లు, 10 కేజీల కాంపోజిట్ సిలిండర్లు ఉన్నాయి. మనం ఇంట్లో వినియోగిస్తున్న  14.2 కేజీల  ఎల్పీజీ సిలిండర్లు ఈ పైలట్ ప్రాజెక్టులో లేవు. 

సర్వీస్ ఎలా పనిచేస్తుంది..?

కస్టమర్స్  ఆర్డర్‌లను స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ అప్లికేషన్ ద్వారా నేరుగా ఇవ్వవచ్చు.

తొలి సారి బుక్ చేయడాన్ని  కొత్త సిలిండర్ ఆర్డర్‌గా పరిగణిస్తారు. ఆ తర్వాత నుంచి రీఫిల్ ఆర్డర్ ఇవ్వవచ్చు. అంటే  డెలివరీ ఎగ్జిక్యూటివ్‌కు ఖాళీ HP సిలిండర్‌ను ఇచ్చివేసి,  రీఫిల్ ఆర్డర్‌లను ఇవ్వవచ్చు.

ALSO READ : IRCTC యూజర్లకు గుడ్ న్యూస్

డెలివరీలన్నీ HPCL డిస్ట్రిబ్యూషన్  నెట్‌వర్క్ ద్వారా నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన డెలివరీ సిబ్బందిని నియమిస్తారు. ప్రతి ఆర్డర్ అవసరమైన సేఫ్టీ, సెక్యూరిటీ గైడెన్స్ కు  అనుగుణంగా ఉండేలా చూసుకుంటారు.

అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ఇటీవల సిలిండర్లు బుక్ చేసినా డెలివరీకి ఎన్నో సమస్యలు. ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు..  మరింత పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

HP సిలిండర్‌ను ఆర్డర్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్:

 

 స్విగ్గీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.  ఒక వేళ యాప్ ఉంటే.. ఇన్‌స్టామార్ట్ ఇంటిగ్రేట్ చేసిన వెర్షన్ ఉందని కన్ఫమ్ చేసుకోండి.

ఇన్‌స్టామార్ట్‌కు యాప్‌ ఓపెన్ చేయండి → ఇన్‌స్టామార్ట్‌పై ట్యాప్ చేయండి 

గ్యాస్ సిలిండర్ డెలివరీ సర్వీస్ ను సర్చ్ చేయండి : మీ డెలివరీ అడ్రెస్ ఎంటర్ చేయండి

HP Gas, LPG, HPCL, HP Navyaa, లేదా Gas Cylinder  కోసం సర్చ్ చేయండి

సిలిండర్‌ను ఎంచుకోండి:  5 కేజీల మెటల్ సిలిండర్లు లేదా 10 కేజీల HP నవ్య కాంపోజిట్ సిలిండర్లు.

కార్ట్‌కు యాడ్ చేసుకోండి. ప్రైస్ చూడండి.. ఏవైనా  ఏవైనా ఆఫర్‌లు, కూపన్‌లను అప్లై చేసుకోండి. చెక్అవుట్‌కు చేయండి.

వివరాలను ఎంటర్ చేయండి. మీరు LPG కనెక్షన్ వివరాలు లేదా వినియోగదారు నంబర్‌ను  రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రీఫిల్‌ల కోసం అయితే తప్పనిసరి. కనెక్షన్ లేని వారి కోసం  కొన్ని ప్రాంతాలలో బుకింగ్ సౌకర్యం ఉంది.

UPI, కార్డ్‌లు, వాలెట్‌లు, అందుబాటులో ఉన్నచోట క్యాష్ ఆన్ డెలివరీ ఆధారంగా పేమెంట్ చేయాలి. ఆర్డర్ చేసే ముందు అడ్రస్ మరోసారి రీచెక్ చేసుకోవడం బెటర్.  

ఈ సర్వీస్ ప్రస్తుతం బెంగళూరులోని కొన్ని ప్రాంతాలకే పరిమిత. పైలట్ ప్రాజెక్ట్ తర్వాత..   ఇతర సిటీలకు విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.