హైదరాబాద్ శివారులో రూ. కోటి 38 లక్షల విలువైన గంజాయి స్వాధీనం... 

హైదరాబాద్ శివారులో రూ. కోటి 38 లక్షల విలువైన గంజాయి స్వాధీనం... 

గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు రంగంలోకి దిగిన ఈగల్ టీం పోలీసులు దూకుడు పెంచారు. హైదరాబాద్ శివారులో రూ. కోటి 38 లక్షల విలువజేసే గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. గురువారం ( జులై 16 ) జరిగిన ఈ తనిఖీలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్ శివారులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఈగల్ టీం పోలీసులు 237 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. కోటి 38 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.

ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా... హైదరాబాద్ లో గంజాయిని సీజ్ చేశారు అధికారులు.ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.  మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈగల్ ఫోర్స్ తెలంగాణ, రాచకొండ నార్కోటిక్స్ పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్ లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ సంయుక్త ఆపరేషన్ లో భాగంగా విజయవాడ ముంబై NH 65 హైవేపై YNR ఫంక్షన్ హాల్ దగ్గర తనిఖీలు చేపట్టామని... MH 14HU 3599 లారీ కంటైనర్‌ను అడ్డగించి తనిఖీలు చేయగా గంజాయి పట్టు పడిందని తెలిపారు. లారీలోని 237 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని వారి దగ్గరి నుంచి మూడు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు.

ALSO READ : స్విగ్గీ నుంచి గ్యాస్ సిలిండర్ ఇన్స్టంట్ డెలివరీ..

నిందితుడైన రాజేష్ కుమార్ గతంలో ముంబైలో లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడని.. ఏడు నెలల క్రితం పూణేకు చెందిన డ్రగ్స్ వ్యాపారులు సురేష్ కేదారీ, ధరమ్ షిండేలతో అతనికి పరిచయం ఏర్పడిందని..సెకండ్ హ్యాండ్ లారీ కంటైనర్ కొనుగోలు చేయడానికి రాజేష్‌కు డబ్బులు సరిపోకపోవడంతో గంజాయి రవాణాలోకి దిగాడని తెలిపారు పోలీసులు.

రాజేష్ కు సురేష్ కేదారీ, ధరమ్ షిండే రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించారని.. అందుకు ప్రతిఫలంగా ఒడిశా నుండి పూణేకు గంజాయి రవాణా చేయాలని రాజేష్ తో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు పోలీసులు. అలా ఏపీలోని ఒడిశాకు చెందిన గంజాయి సప్లయర్ పబ్రితా కుమార్ ను కలిసి గంజాయి రవాణా చేస్తున్నాడని తెలిపారు.

జూలై 14, 2026 రాత్రి వేళలో పబిత్రా కుమార్ ఒక ఫోర్ వీలర్‌లో వచ్చి 10 గంజాయి సంచులను (237 కేజీలు) వీరికి అప్పగించాడని.. డ్రైవర్ కూర్చునే పై క్యాబిన్లో గంజాయి దాచారని తెలిపారు పోలీసులు. గంజాయి లోడ్ చేసుకుని హైదరాబాద్ మీదుగా పూణే వెళ్తుండగా అరెస్ట్ చేశామని తెలిపారు పోలీసులు. సురేష్ కేదారి, ధరమ్ సిడి, పబిత్రా కుమార్ పరారీలో ఉన్నారని... త్వరలోనే పరారీలో ఉన్న నిందితుల్ని పట్టుకుంటామని తెలిపారు పోలీసులు.