హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గాంధీ భవన్ లో పాలాభిషేకాలపై నిషేధం విధించింది పార్టీ అధిష్టానం. పాలాభిషేకాలు చేయడం, జేసీబీలు వాడి నాయకులకు గజమాలలు వేయడంపై కూడా నిషేధం విధించింది. ఈమేరకు గురువారం ( జులై 16 ) పార్టీ శ్రేణులు, నాయకులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్.
కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కార్యక్రమమైనా, ఏ వేదికైనా పాలాభిషేకాలు, జలాభిషేకాలు చేయొద్దని ఆదేశించారు మీనాక్షి నటరాజన్. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని వెల్లడించారు.
ALSO READ : కిడ్నీలైనా మార్చండి.. చనిపోయేందుకు అనుమతైనా ఇవ్వండి
పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు, వ్యక్తి పూజలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
