కురుక్షేత్రం.. మహాభారతయుద్దం ద్వాపరయుగం చివరిలో ఎంతో భయంకరంగా సాగింది. 18 రోజుల పాటు పాండవులకు, కౌరవులకు మధ్య జరిగిన యుద్దంలో ఎందరో మహానుభావులు పాల్గొన్నారు. ఎంతోమంది లెక్కలేనంతమంది మరణించారు. కాని అత్యంత బలసాలి.. సమస్త విద్యలు తెలిసిన బలరాముడు మాత్రం ఈ యుద్దంలో పాల్గొనలేదు. అదే అత్యంత శక్తికలిగిన బలరాముడు ఈ యుద్దంలో పాల్గొంటే కేవలం రెండు రోజుల్లో యుద్దం ముగిసేది.. మరి ఆయన ఎందుకు పాల్గొనలేదు.. పురాణాల్లో ఏముంది. కురుక్షేత్ర యుద్దంలో ఎవరి పక్షాన ఎందుకు చేరలేదు..మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.. . !
ద్వాపరయుగంలో జరిగిన మహాభారత యుద్దంలో కీలకపాత్రను శ్రీకృష్ణుడు పోషించాడు. ఆయన సోదరుడే బలరాముడు. అయినా సరే బలరాముడు మాత్రం యుద్దంలో పాల్గొనలేదు. వాస్తవానికి శ్రీకృష్ణుని కంటే బలరాముడు అత్యంత శక్తిమంతుడు. ఆయన పాండవులకుకాని.. కౌరవులకు కాని మద్దతు ఇస్తే వారికి ఓటమి భయం అనేది ఉండదు.
మహాభారతంలోని శల్య పర్వం ప్రకారం.. బలరామునికి ఈ యుద్దం జరగడం అస్సలు ఇష్టంలేదు. పాండవులు.. కౌరవులు.. అన్నదమ్ములు.. సోదరుల మధ్య యుద్దం.. ఒకరిని మరొకరు చంపుకొనడం వంటి ఘటనలు చూడటానికి ఆయన ఇష్టంలేదని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆయన పాండవులను.. కౌరవులను ఇద్దరిని సమానంగా ప్రేమించాడు. అందుకే యుద్దంలో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నాడని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
కురుక్షేత్ర యుద్దం సమయంలో బలరాముడు చాలా ఆందోళనకు చెందాడు. పరిస్థితుల ప్రభావం.. అన్నదమ్ముల గొడవులు.. సోదరికి జరిగిన అవమానం అతని మనసును కలవరపెట్టాయి. సోదరుల పట్ల ఉన్న ప్రేమతో ఎవరి పక్షాన వహించకుండా.. యుద్ధం ప్రారంభం కాకముందే, బలరాముడు సరస్వతీ నదీ తీరంలోని పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రకు బయలుదేరాడు యుద్ధాన్ని ఆపాలని బలరాముడు అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించి.. దానధర్మాలు చేశాడని పండితులు చెబుతున్నారు.
కుస్తీ విద్యలో గదా నైపుణ్యంలో భీముడు.. దుర్యోధనుడు ఇద్దరూ అత్యంత శక్తివంతులే. వీరు బలరాముడిని గురువుగా భావించేవారు. తన ఇద్దరు శిష్యులను ఎంతో గౌరవంగా, ఆప్యాయంగా చూసుకునేవాడు. వారిలో ఎవరి ఓటమిని ఆయన ఊహించడానికి ఇష్టపడలేదు. అందుకే ఈ యుద్దంలో ఎవరి పక్షాన నిలవలేదు. ఈ యుద్దం జరగకూడదని బలరాముడు ముందుగానే శ్రీకృష్ణునికి చెప్పాడు.
తన శిష్యుడైన దుర్యోధనుడిపై కానీ, తన తమ్ముడు శ్రీకృష్ణుడు మద్దతు ఇస్తున్న పాండవులపై కానీ ఆయుధం ఎత్తడం బలరాముడికి ఇష్టం లేదు. ఈ ధర్మసంకటం వల్ల ఆయన యుద్ధంలో ఎవరి పక్షాన చేరకుండా తటస్థంగా ఉండిపోయాడు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
