చాలు జడ్డూ, ఇక రిటైర్ అవ్వు.. గంభీర్ నిర్ణయంతో స్టార్ ప్లేయర్‌ కెరీర్ ముగిసినట్టేనా?

చాలు జడ్డూ, ఇక రిటైర్ అవ్వు.. గంభీర్ నిర్ణయంతో స్టార్ ప్లేయర్‌ కెరీర్ ముగిసినట్టేనా?

Ravindra Jadeja: భారత క్రికెట్‌లో ఇప్పుడు ఒక సరికొత్త వైబ్ (Vibe) నడుస్తోంది. హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి టీమిండియా సెలెక్షన్ స్ట్రాటజీ మొత్తం మారిపోయింది. సుదీర్ఘకాలం పాటు త్రీ-ఇన్-వన్ పర్ఫార్మెన్స్‌తో రఫ్పాడించిన సర్ రవీంద్ర జడేజాకు వన్డేల్లో ఊహించని షాక్ తగిలింది. ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్‌లో జడ్డూ ఫ్యూచర్‌పైనే హాట్ డిస్కషన్ కొనసాగుతుంది. 

ముగిసిన వన్డే ఎరా?.. తగ్గిన జడ్డూ ఇంపాక్ట్:
ఒకప్పుడు రవీంద్ర జడేజా మైదానంలో ఉంటే ఆ వైబ్రేషన్స్ వేరే లెవెల్‌లో ఉండేవి.. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో అదరగొట్టిన జడ్డూ.. గత కొంతకాలంగా వన్డేల్లో ఆశించిన మేర ఇంపాక్ట్ (Impact) చూపించలేకపోతున్నాడు. ముఖ్యంగా 2019 వరల్డ్ కప్ తర్వాత అతని పవర్ హిట్టింగ్ సామర్థ్యం బాగా తగ్గిపోయింది. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడానికి గతంలో ఉన్న సత్తా ఇప్పుడు కనిపించడం లేదు. దీంతో రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో స్పిన్ పిచ్‌లు ఉంటే తప్ప అతనికి చోటు దక్కడం కష్టమేనని క్రీడా పండితులు పేర్కొంటునన్ఆరు. జడ్డూ వన్డే కెరీర్ దాదాపు ఎండ్ కార్డ్‌కు వచ్చేసిందనేది ఇన్సైడ్ టాక్. 

భారత్ నయా ఎక్స్-ఫ్యాక్టర్: 
2027 వన్డే వరల్డ్ కప్‌కు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది. అక్కడి బౌన్సీ, పేస్ పిచ్‌లపై రాణించాలంటే భారత్ కి ఒక ప్రాపర్ గేమ్-ఛేంజర్ (Game-changer) అవసరం. కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్ అయినప్పటికీ బ్యాటింగ్‌లో పెద్దగా కంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాడు. అందుకే కోచ్ గౌతమ్ గంభీర్.. అక్షర్ పటేల్‌ను తన ప్రైమ్ ఛాయిస్ (Prime Choice)గా సెలక్ట్ చేసుకున్నాడు. గత కొన్ని సిరీస్‌లుగా అక్షర్ పటేల్ ఫామ్‌లో ఉంటూ ఏడో స్థానంలో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌తో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపిస్తున్నాడు. ప్రస్తుతం గంభీర్ వ్యూహాల్లో అక్షరే నంబర్ వన్ ఆల్‌రౌండర్ గా ఉన్నాడు. 

గంభీర్ టాక్టికల్ బ్లూప్రింట్: 
ఎప్పుడూ ఒక ప్లాన్‌కే పరిమితం కాకుండా బ్యాకప్ ఆప్షన్లను సిద్ధం చేసుకోవడం గౌతమ్ గంభీర్ మార్క్ స్టైల్.. గంభీర్ డిజైన్ చేసిన ఈ టాక్టికల్ బ్లూప్రింట్ (Tactical Blueprint) లో యంగ్ ప్లేయర్స్ కి పెద్ద పీట వేశారు: ఒకవేళ టోర్నీలో స్పిన్ ట్రాక్స్ ఎదురైతే, టీమ్‌కు అదనపు బూస్ట్ ఇచ్చేందుకు వాషింగ్టన్ సుందర్ రూపంలో ఒక సాలిడ్ ఆప్షన్ ఉంది. లాంగ్ టర్మ్ ప్లాన్‌లో భాగంగా అక్షర్ పటేల్‌కు ప్రత్యామ్నాయంగా దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న నెక్స్ట్-జెన్ (Next-Gen) యువ ఆటగాడు హర్ష్ దూబేను కూడా మేనేజ్‌మెంట్ సానబెడుతుంది. 

ఫ్యాన్స్ ఫుల్ జోష్: 
రవీంద్ర జడేజా లాంటి లెజెండరీ ప్లేయర్ స్థానాన్ని రీప్లేస్ చేయడం అంత ఈజీ కాదు. కానీ టీమ్ ప్రయోజనాల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిరూపించాడు. ఈ యంగ్ అండ్ డైనమిక్ నయా టీమిండియా ప్లేయర్ సరికొత్త పంథాలో దూసుకుపోతుండటంతో క్రీడాభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. రాబోయే సిరీస్‌లలో అక్షర్ పటేల్ జట్టులో ఎలా రాణిస్తాడో చూడాలి మరీ.