సోనమ్ వాంగ్చుక్ నిరసనకు అతుల్ కుల్కర్ణి మద్దతు.. వన్ డే హంగర్ స్ట్రైక్‌కు పిలుపు!

సోనమ్ వాంగ్చుక్ నిరసనకు అతుల్ కుల్కర్ణి మద్దతు.. వన్ డే హంగర్ స్ట్రైక్‌కు పిలుపు!

దేశంలో విద్యావ్యవస్థ ప్రక్షాళన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ నిరసన దీక్ష ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష విజయవంతంగా 19వ రోజుకు చేరింది . నీట్ (NEET-UG) పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యాశాఖలో అవినీతికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP)తో కలిసి వాంగ్చుక్ చేస్తున్న ఈ పోరాటానికి బాలీవుడ్ నుంచి భారీ మద్దతు లభిస్తోంది.

వాంగ్చుక్ మద్దతుగా.. 

లేటెస్ట్ గా ఈ ఉద్యమంలోకి 'రంగ దే బసంతి' ఫేమ్, విలక్షణ నటుడు అతుల్ కుల్కర్ణి ఎంట్రీ ఇచ్చారు. ఈ రోజు ( జూలై 16, 2026 ) తాను ఇంటి నుంచే ఒక రోజు నిరాహార దీక్ష చేయబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.  ప్రభుత్వం ఈ అంశంపై సున్నితంగా స్పందించి, వెంటనే చర్చలు ప్రారంభించాలని కోరారు.

అతుల్ కుల్కర్ణి ఏమన్నారంటే..?

బాధకు బాధతో కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం . సోనమ్ జీ పడుతున్న పెయిన్‌ను పంచుకోవడానికి, అలాగే ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి వెంటనే చర్చలు జరపాలని కోరడానికే నేను ఈ దీక్ష చేస్తున్నా అని అతుల్ తెలిపారు. మన ప్రభుత్వం సున్నితమైనదే.. కానీ ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ ఆలస్యం జరుగుతోంది. మీకూ ఈ కాజ్ కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియోను షేర్ చేసి, మీరు కూడా ఒక్కరోజు ఉపవాసం ఉండండి అంటూ పిలుపునిచ్చారు.

 

సెలబ్రిటీల సపోర్ట్..

కేవలం అతుల్ కుల్కర్ణి మాత్రమే కాదు.. ఇప్పటికే శబానా అజ్మీ, అభయ్ డియోల్, జీనత్ అమన్, అనురాగ్ కశ్యప్, ఒమి వైద్య వంటి సెలబ్రిటీలు సోనమ్ వాంగ్చుక్‌కు బహిరంగంగా మద్దతు పలికారు.  విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయ చేస్తున్న ఈ పోరాటం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సెలబ్రిటీల ఎంట్రీతో ఈ ఉద్యమం మరింత పెరిగే అవకాశంగా మారింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరుపుతుందో లేదో చూడాలి.