PV Sindhu: ఇండియన్ బ్యాడ్మింటన్ క్వీన్, రెండు సార్లు ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 (Japan Open Super 750) టోర్నమెంట్‌లో సరికొత్త వైబ్‌తో దూసుకుపోతోంది. ఈరోజు (గురువారం) జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్స్ మ్యాచ్‌లో చైనాకు చెందిన వరల్డ్ నంబర్ 5 క్రీడాకారిణి, ఐదో సీడ్ హాన్ యుయె (Han Yue) కు సింధు చుక్కలు చూపించింది. మైండ్ బ్లోయింగ్ అటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థిని కోర్టు నలుమూలలా పరిగెత్తించి స్ట్రెయిట్ గేమ్స్‌లో విజయం సాధించింది. ఈ సాలిడ్ విక్టరీతో సింధు క్వార్టర్ ఫైనల్స్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది.
కేవలం 35 నిమిషాల్లోనే ఖేల్ ఖతం:
మ్యాచ్ ప్రారంభం నుంచే సింధు కోర్టులో పూర్తి ఆధిపత్యాన్ని (Dominance) ప్రదర్శించింది. మొదటి గేమ్ ఆరంభంలో చైనా షట్లర్ గట్టి పోటీ ఇచ్చి స్కోరును సమం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, సింధు తన పవర్‌ఫుల్ బేస్‌లైన్ స్మాష్‌లు, ఖచ్చితమైన షాట్ ప్లేస్‌మెంట్‌తో 21–16తో మొదటి గేమ్‌ను కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లోనైతే సింధు పూర్తిగా రూత్‌లెస్’ (Relentless) మోడ్‌లోకి వెళ్ళింది. మ్యాచ్‌ను చేతుల్లోకి తీసుకుంటూ వరుసగా 8 పాయింట్లు కొట్టి 8–0తో భారీ లీడ్ సాధించింది. చైనా ప్లేయర్ పుంజుకోవడానికి చిన్న ప్రయత్నం చేసినా, సింధు ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా 21–14 తేడాతో మ్యాచ్‌ను క్లోజ్ చేసింది. కేవలం 35 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించి, హాన్ యుయెపై తన హెడ్-టు-హెడ్ రికార్డును 8–1తో మరింత బలోపేతం చేసుకుంది.
క్వార్టర్స్‌లో ఒకుహరాతో బిగ్ ఫైట్:
క్వార్టర్ ఫైనల్స్‌లో పీవీ సింధు, జపాన్ స్టార్ షట్లర్, మాజీ వరల్డ్ ఛాంపియన్ నోజోమి ఒకుహరా (Nozomi Okuhara) తో తలపడనుంది. నిజానికి ఈ రౌండ్‌లో ఒకుహరా టాప్ సీడ్, వరల్డ్ నంబర్ 1 అన్ సె-యంగ్ (South Korea)తో తలపడాల్సి ఉంది. కానీ అన్ సె-యంగ్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఒకుహరాకు వాకోవర్ లభించి నేరుగా క్వార్టర్స్ చేరింది. సింధు, ఒకుహరాల మధ్య గతంలో ఎన్నో ఐకానిక్ మ్యాచ్‌లు జరిగాయి కాబట్టి, ఈ రాబోయే పోరు అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇండియా వన్-ఉమెన్ ఆర్మీ:
ప్రస్తుతం జపాన్ ఓపెన్‌లో భారత్ తరపున పీవీ సింధు ఒక్కరే (One-Woman Army) ఒంటరి పోరాటం చేస్తోంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో బరిలోకి దిగిన ధ్రువ్ కపిల - తనీషా క్రాస్టో జోడి చైనా టాప్ సీడ్స్ ఫెంగ్ యాన్ జె - హువాంగ్ డాంగ్ పింగ్‌లపై మొదటి గేమ్‌లో అద్భుతంగా పోరాడినప్పటికీ 20-22, 17-21 తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పటికే మెన్స్ సింగిల్స్‌లో స్టార్ ఆటగాడు లక్ష్యసేన్, ఆయుష్ శెట్టిలతో పాటు ఉమెన్స్ సింగిల్స్‌లో ఉన్వతి హుడా మొదటి రౌండ్‌లోనే ఎగ్జిట్ అవ్వడంతో, టోర్నీలో భారత్ తరపున సింధు మాత్రమే నిలిచింది.
PV Sindhu proved once again stronger against 5th seed Han Yue🇨🇳 (8-1 H2H) & placed into her 6th QFs of this year in some dominance & fluency!👌
— Amit Kumar De (@AmitK98infinite) July 16, 2026
She will meet her familiar opponent & off court friend Nozomi Okuhara🇯🇵 at QFs who got w/o from ASY yesterday. 👍#JapanOpen2026 https://t.co/MleClcdZEo pic.twitter.com/mDQyx1zhrO
