ఇండియన్ సినీ బాక్సాఫీస్ వద్ద మోస్ట్ పాపులర్ హారర్ ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకున్న 'రాగిణి' సిరీస్ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ బాలాజీ మోషన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'రాగిణి 3' ( Ragini 3 ) షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది . మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ తొలి షెడ్యూల్ లండన్ లో జరుపుకుంటుంది.
డేట్-నైట్ హారర్ గా..
2011లో వచ్చిన 'రాగిణి MMS' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ మూడో పార్ట్ ప్యూర్ ఎరోటిక్ థ్రిల్లర్‌గా కాకుండా.. సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఈసారి హారర్‌కు కాస్త రొమాన్స్, బోలెడంత హ్యూమర్ (కామెడీ), ఊహించని ట్విస్టులను జోడించి సరికొత్త డేట్-నైట్ హారర్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఈ విభిన్నమైన చిత్రానికి దర్శకుడు శశాంక ఘోష్ ప్రాణం పోస్తున్నారు.
తమన్నా మాత్రమే ఎందుకు?
గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు.. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలతోనూ మెప్పించగల తమన్నా.. ఈ సినిమాలో అత్యంత రహస్యమైన, ఊహకందని క్యారెక్టర్లో కనిపించనుంది. హారర్, రొమాన్స్, కామెడీ కలగలిసిన ఈ కథకు తమన్నా అయితేనే వంద శాతం న్యాయం చేయగలదని మేకర్స్ భావించారు. అందుకే ఈ రోల్ కోసం ఫస్ట్ ఛాయిస్‌గా ఆమెనే ఎంపిక చేసుకున్నారు.
బిగ్ కాస్టింగ్.. బిగ్గర్ ప్లాన్!
లండన్ అందాల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కిడ్ జునైద్ ఖాన్, యంగ్ హీరో ఆయుష్ శర్మతో పాటు గ్లామరస్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంతటి భారీ తారాగణంతో లండన్ వీధుల్లో జరుగుతున్న ఈ షూటింగ్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. బాలాజీ టెలిఫిలిమ్స్ లిమిటెడ్ విభాగానికి చెందిన బాలాజీ మోషన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. 2027లో ఈ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా కథ, మిగతా పాత్రలకు సంబంధించిన మరిన్ని క్రేజీ అప్డేట్స్ అందించనున్నారు మేకర్స్..
Every date night STARTS with a smile… 👀 Swipe to meet #Ragini! #ShootBegins #Tamannaah#Ragini3 #DateNightHorror@tamannaahspeaks pic.twitter.com/eIfH2cfJti
— BalajiMotionPictures (@balajimotionpic) July 16, 2026
