కార్యకర్తల కోసం వైసీపీ మాస్టర్ ప్లాన్... జగన్ 2.0 సూపర్ యాప్ ప్రారంభం...

కార్యకర్తల కోసం వైసీపీ మాస్టర్ ప్లాన్... జగన్ 2.0 సూపర్ యాప్ ప్రారంభం...

ఏపీలో 2024 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసన, బీజేపీ కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలు, నేతలపై కేసులు పెడుతూ వరుసగా అరెస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కార్యకర్తలను కాపాడుకోవడంపై ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత జగన్. గురువారం ( జులై 16 ) జగన్ 2.0 సూపర్ యాప్ ను లాంచ్ చేశారు జగన్.

జగన్ 2.0 సూపర్ యాప్ ను లాంచ్ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల కోసం యాప్ తీసుకొచ్చామని అన్నారు. సోషల్ మీడియాలో వైసీపీ కంటెంట్ ను తొలగిస్తున్నారని... అందుకే మన యాప్ తీసుకొస్తున్నామని అన్నారు జగన్.

►ALSO READ | విశాఖ షిప్పింగ్ హార్బర్ లో మరో ప్రమాదం.. బోటు బోల్తా.. సముద్రంలో పడిపోయిన మత్స్యకారులు

ప్రతి కార్యకర్త తన అభిప్రాయాన్ని యాప్ లో చెప్పుకోవచ్చని... పార్టీ నేతలంతా నేరుగా కార్యకర్తలతో టచ్ ఉండేలా యాప్ డిజైన్ చేశామని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇందులో చెప్పుకోవచ్చని... తమపై పెట్టిన కేసుల వివరాలు కార్యకర్తలు పంచుకోవచ్చుని అన్నారు జగన్. 

వేధింపులకు గురైన వారు యాప్ వివరాలు తెలపవచ్చని అన్నారు జగన్. కూటమి ప్రభుత్వం కేసులు, అరెస్టుల పరంపరతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ శ్రేణులకు జగన్ 2.0 సూపర్ యాప్ ఏ మేరకు ఉరటనిస్తుందో చూడాలి.