న్యూజీలాండ్ లో భారీ భూకంపం సంభవించింది. సునామీ వార్నింగ్ ఇవ్వటంతో పరిస్థితి తీవ్ర ఆందోళన కరంగా మారింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో వచ్చిన భూకంపంతో న్యూజీలాండ్ దక్షిణ తీర ప్రాంతంలో ఒక్కసారిగా ప్రకంపనలు వచ్చాయి. దీంతో జనాలు పరుగులు తీశారు.
గురువారం (జులై 16) సౌత్ ఐలండ్ దక్షణి తీరంలో వచ్చిన భూకంపం సునామీకి దారి తీస్తుందని వచ్చిన వార్తలతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తీరప్రాంత ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలలని హెచ్చరికలు జారీ చేశారు.
భూకంపం జరిగిన వెంటనే, ముందుజాగ్రత్త చర్యగా ప్రభావిత తీర ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే ఎత్తైన ప్రదేశాలకు తరలి వెళ్లాలని అత్యవసర అధికారులు కోరారు. క్వీన్స్‌టౌన్‌కు పశ్చిమాన సుమారు 83 కిలోమీటర్ల దూరంలో, 76 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది.
భూకంపం కారణంగా ఏ క్షణమైనా సునామీ రావచ్చని మొదట హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం అంచనా వేసిన దానికంటే తక్కువ పరిమాణంలో ఉండటంతో హెచ్చరిక స్థాయిని సలహా స్థాయి తగ్గించినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది.
►ALSO READ | జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్య సందేశం? ట్రంప్ బృందంపై ‘యుద్ధ లాభాల’ ఆరోపణలు!
ప్రభావిత తీరప్రాంతాల్లోని ప్రజలు వెంటనే ఎత్తైన ప్రదేశాలకు తరలి వెళ్లాలని ముందుగా ఆదేశించిన అధికారులు.. ఆ తర్వాత తీరం వెంబడి ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించడంతో పాటు, మరో టూరిస్టు కేంద్రమైన మిల్ఫోర్డ్ సౌండ్‌లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని
ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు భారీ కుదుపుతో భయాందోళనలకు గురైనట్లు పేర్కొన్నారు.
