ఒడిశా: పూరీ జగన్నాథ స్వామి రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. రథ యాత్రలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో ఒక భక్తుడు ఊపిరాడక కుప్పకూలిపోయాడు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడిన అతనిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. దాదాపు 100 మందికి పైగా భక్తులు ఈ తొక్కిసలాటలో గాయపడినట్లు తెలిసింది. ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పూరీ జగన్నాధ రథయాత్ర గురువారం (జులై 16, 2026) ప్రారంభమైంది.
#Puri | Puri Rath Yatra 2026: A devotee died reportedly due to suffocation. The person collapsed after experiencing breathing difficulty and was rushed to Puri DHH, where doctors confirmed his death.
— OTV (@otvnews) July 16, 2026
Meanwhile, several others are feared injured. #RathYatra #RathYatra2026… pic.twitter.com/e7N6sBfOlW
దేశంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఇది ఒకటి. 1971 నుంచి జరుగుతున్న ఈ రథయాత్రను ఈసారి అత్యంత వైభవంగా రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. జగన్నాథ్ రథ యాత్ర ప్రతి యేటా హిందూ మాసం ఆషాఢలోని శుక్లపక్షం ద్వితీయ తిథిన ప్రారంభమవుతుంది.
VIDEO | Puri, Odisha: A person, who appeared to have fainted, taken for medical treatment as huge number of people gather to attend the annual Jagannath Rath Yatra.
— Press Trust of India (@PTI_News) July 16, 2026
Heavy security arrangements have been put in place to manage the surge in footfall and ensure the smooth conduct… pic.twitter.com/jhf32hhPKo
పూరీ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ప్రత్యేకమైనది జగన్నాథ రథయాత్ర. దేశంలో పూరీ జగన్నాథ రథయాత్ర అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ నగర వీధుల్లో ఊరేగిస్తారు.
►ALSO READ | అది నల్లతాచు పాము తల్లీ.. ఏదో తాడును పట్టుకున్నట్లు పట్టుకున్నావ్.. మాకు చూస్తేనే వణుకు వస్తోంది..!
ఈ రథం దాదాపు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. నేత్రపర్వంగా సాగే ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరీ నుంచి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది.
#ରଥଯାତ୍ରା_୨୦୨୬
— ଓଟିଭି (@otvkhabar) July 16, 2026
ଆଉ କିଛି ସମୟ ପରେ ଆରମ୍ଭ ହେବ ରଥଟଣା। ବଡ଼ଦାଣ୍ଡ ପାଲଟିଛି ଜନସମୁଦ୍ର #RathaJatraWithOtv #ShreeJagannath #Puri #RathaJatra #GhoshaYatra #GundichaJatra #LordJagannath #RathaJatra2026 #JayJagannath #Odisha #OTV pic.twitter.com/J5x4pL3GKN
