అవినీతి నిర్ములనే లక్ష్యంగా పని చేస్తున్న ఏసీబీ దూకుడు పెంచింది.ఆదిలాబాద్ లో మరో ఇద్దరు అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఆదిలాబాద్ లోని ఇరిగేషన్ ఆఫీసులో రూ. లక్ష లంచం తీసుకుంటుండగా ఈఈ విఠల్, ఏఈ రమేష్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. గురువారం ( జులై 16 ) జరిగిన ఈ తనిఖీలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
సోనాలలో పౌల్ట్రీ ఫామ్ ఎన్ సీఓ కోసం మూడు లక్షలు లంచం డిమాండ్ చేయగా.. రూ. లక్షకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఇవాళ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఈఈ విఠల్, ఏఈ రమేష్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.
►ALSO READ | రెండో తరగతి విద్యార్థులకు మతపరమైన హోంవర్క్.. టీచర్‌పై వేటు
