నా కొడుక్కి 'రామ్ ఖాన్' అని పేరు పెట్టాలనుకున్నా.. షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన సోహైల్ ఖాన్!

నా కొడుక్కి 'రామ్ ఖాన్' అని పేరు పెట్టాలనుకున్నా.. షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన సోహైల్ ఖాన్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ లేటెస్ట్ గా చేసిన  వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రియాలిటీ షో 'అలయన్స్'లో నటుడు అలీ గోనితో జరిగిన సరదా సంభాషణలో తన పెద్ద కుమారుడికి మొదట 'రామ్ ఖాన్ ' అనే పేరు పెట్టాలని భావించినట్లు సోహైల్ వెల్లడించాడు. ఈ వ్యాఖ్య ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకు దారి తీస్తోంది.

అసలేం జరిగిందంటే?

ఈ షోలో అలీ గోని..  సోహైల్, సీమా సజ్దేల  పెంపకాన్ని తెగ పొగిడేశాడు.  మీ పిల్లలు నిర్వాన్, యోహాన్ చాలా పద్ధతిగా పెరిగారు. ఎంతో క్రమశిక్షణతో ఉంటారుఅని ప్రశంసించాడు. అంతేకాదు, పెద్ద కొడుకు నిర్వాన్ అచ్చం తండ్రి పోలికలతోనే ఉంటాడని గుర్తుచేశాడు. ఈ కాంప్లిమెంట్‌కు మురిసిపోయిన సోహైల్ ఖాన్.. తన పెద్ద కొడుకు పేరు వెనుక ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ ఫ్లాష్‌బ్యాక్‌ను బయటపెట్టాడు.

'రామ్ ఖాన్' పేరు ఫిక్స్ అయ్యా..

సీమా గర్భవతిగా ఉన్న సమయంలో సరదాగా ఒక ఒప్పందం చేసుకున్నామని, అబ్బాయి పుడితే తానే పేరు పెడతానని, అమ్మాయి అయితే సీమా నిర్ణయిస్తుందని చెప్పాడు. అప్పటికే తన మనసులో 'రామ్ ఖాన్' అనే పేరు ఫిక్స్ చేసుకున్నానని, మా కుటుంబం మత సామరస్యాన్ని విశ్వసిస్తుంది. అందుకే ఆ పేరు పెట్టాలనుకున్నాను అని వివరించాడు.

►ALSO READ | Tamannaah: డేట్ నైట్ మసాలాతో వస్తున్న మిల్కీ బ్యూటీ.. లండన్‌లో తమన్నా ‘రాగిణి 3’ షూటింగ్ స్టార్ట్!

అయితే బిడ్డ పుట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందట. డెలివరీ అనంతరం స్పృహలోకి వచ్చిన సీమా మొదట అడిగిన మాట నిర్వాన్ ఎలా ఉన్నాడు? అని. ఆ క్షణంలోనే 'నిర్వాన్' అనే పేరు తనకు ఎంతో నచ్చిందని, దాన్నే ఖరారు చేశానని సోహైల్ తెలిపాడు. అంతేకాదు, తన కుమారుడు కూడా పేరుకు తగ్గట్టుగానే ప్రశాంత స్వభావం, ఓర్పు, సమతుల్య ఆలోచనలతో పెరిగాడని గర్వంగా చెప్పాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా .. 'రామ్ ఖాన్' అనే పేరు వెనుక ఉన్న ఆలోచన, అలాగే కుటుంబంలో మత సామరస్యానికి ఇచ్చిన ప్రాధాన్యం అభిమానులను ఆకట్టుకుంటోంది..