Tamannaah: డేట్ నైట్ మసాలాతో వస్తున్న మిల్కీ బ్యూటీ.. లండన్‌లో తమన్నా ‘రాగిణి 3’ షూటింగ్ స్టార్ట్!

Tamannaah: డేట్ నైట్ మసాలాతో వస్తున్న మిల్కీ బ్యూటీ.. లండన్‌లో తమన్నా ‘రాగిణి 3’  షూటింగ్ స్టార్ట్!

ఇండియన్ సినీ బాక్సాఫీస్ వద్ద మోస్ట్ పాపులర్ హారర్ ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకున్న 'రాగిణి' సిరీస్ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ బాలాజీ మోషన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'రాగిణి 3' ( Ragini 3 ) షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది . మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ తొలి షెడ్యూల్ లండన్ లో జరుపుకుంటుంది.

 డేట్-నైట్ హారర్ గా.. 

2011లో వచ్చిన 'రాగిణి MMS' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ మూడో పార్ట్ ప్యూర్ ఎరోటిక్ థ్రిల్లర్‌గా కాకుండా.. సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఈసారి హారర్‌కు కాస్త రొమాన్స్, బోలెడంత హ్యూమర్ (కామెడీ), ఊహించని ట్విస్టులను జోడించి సరికొత్త డేట్-నైట్ హారర్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఈ విభిన్నమైన చిత్రానికి దర్శకుడు శశాంక ఘోష్ ప్రాణం పోస్తున్నారు.

తమన్నా మాత్రమే ఎందుకు?

గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు..  పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలతోనూ మెప్పించగల తమన్నా.. ఈ సినిమాలో అత్యంత రహస్యమైన, ఊహకందని క్యారెక్టర్‌లో కనిపించనుంది. హారర్, రొమాన్స్, కామెడీ కలగలిసిన ఈ కథకు తమన్నా అయితేనే వంద శాతం న్యాయం చేయగలదని మేకర్స్ భావించారు. అందుకే ఈ రోల్ కోసం ఫస్ట్ ఛాయిస్‌గా ఆమెనే ఎంపిక చేసుకున్నారు.

బిగ్ కాస్టింగ్.. బిగ్గర్ ప్లాన్!

లండన్ అందాల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కిడ్ జునైద్ ఖాన్, యంగ్ హీరో ఆయుష్ శర్మతో పాటు గ్లామరస్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంతటి భారీ తారాగణంతో లండన్ వీధుల్లో జరుగుతున్న ఈ షూటింగ్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. బాలాజీ టెలిఫిలిమ్స్ లిమిటెడ్ విభాగానికి చెందిన బాలాజీ మోషన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. 2027లో ఈ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా కథ, మిగతా పాత్రలకు సంబంధించిన మరిన్ని క్రేజీ అప్‌డేట్స్ అందించనున్నారు మేకర్స్..