సైబర్ నేరాలే భవిష్యత్ లో అతిపెద్ద సవాల్ అని అన్నారు డీజీపీ సీవీ ఆనంద్. సైబర్ మోసాలతో కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయని.. జీవితకాల పొదుపులు కోల్పోతున్నారని అన్నారు సీవీ ఆనంద్. గురువారం ( జులై 16 ) తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించిన ఆయన ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ కేసుల్లో 44 శాతం తెలంగాణలోనే నమోదవుతున్నాయని అన్నారు సీవీ ఆనంద్.
AI ఆధారిత కాల్ సెంటర్ సేవలను విస్తరించాలని... 2025లో సైబర్ నేరాల వల్ల రూ.1,524 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని అన్నారు. ప్రతి నాలుగు ప్రధాన నేరాల్లో ఒకటి సైబర్ నేరమేనని.. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్లు, ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్‌లు వేగంగా పెరుగుతున్నాయని అన్నారు.
ప్రతి పోలీసు అధికారి సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి పట్టు సాధించాలని అన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని... OTPలు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పొద్దని సూచించారు సీవీ ఆనంద్.
►ALSO READ | హైదరాబాద్ శివారులో రూ. కోటి 38 లక్షల విలువైన గంజాయి స్వాధీనం...
