TCS, HCL, Wipro, Tech Mahindra.. ఈ నాలుగు ఐటీ సంస్థల ఉద్యోగులకు ఈ ముచ్చట తెలుసో.. లేదో..!

TCS, HCL, Wipro, Tech Mahindra.. ఈ నాలుగు ఐటీ సంస్థల ఉద్యోగులకు ఈ ముచ్చట తెలుసో.. లేదో..!

ప్రముఖ ఐటీ కంపెనీలు జూన్ త్రైమాసిక ఆదాయాలను ప్రకటించాయి. ఈ సందర్భంలో ఉద్యోగుల సంఖ్య, నియామకానికి సంబంధించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 2026లో ఐటీ కంపెనీల్లో రిక్రూట్మెంట్స్ మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాలా ఉంది. కొన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటే, మరికొన్ని కంపెనీలు ఉన్న ఉద్యోగులను తొలగించి వర్క్ ఫోర్స్ను తగ్గించున్నాయి.

విప్రో వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ ఉద్యోగుల సంఖ్యను పెంచి తన నియామకాల పరంపరను కొనసాగించింది. టెక్ మహీంద్రా మాత్రం తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ పోయింది. TCS భారీగా రిక్రూట్మెంట్స్కు తెరతీయగా.. HCL టెక్ కంపెనీలో గత రెండేళ్లలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆ స్థాయిలో ఈ సంస్థలో లేఆఫ్స్ జరిగాయి.

►ALSO READ | మొబైల్ యూజర్లకు ముఖ్య గమనిక.. TRAI పెద్ద విషయమే చెప్పిందిగా..!

విప్రో ఈ త్రైమాసికంలో 888 మంది ఉద్యోగులను కొత్తగా రిక్రూట్ చేసుకుంది. దీంతో.. విప్రోలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2 లక్షల 43 వేల 44కు చేరింది. బెంగళూరుకు చెందిన ఈ ప్రముఖ ఐటీ సంస్థ వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ ఉద్యోగుల సంఖ్యలో వృద్ధిని నమోదు చేయడం విశేషం. అయితే.. 3వేల 200 మందికి పైగా నిపుణులు పనిచేస్తున్న మైండ్‌స్ప్రింట్‌ను అక్వైర్ చేసుకున్న విప్రోలో ఈ తాజా చేర్పులు ఊహించిన దానికంటే తక్కువగానే ఉన్నాయి.

ఇక.. TCS విషయానికొస్తే.. ఈ త్రైమాసికంలో మిగిలిన ఐటీ సంస్థల కంటే ఎక్కువగానే నియామకాలు జరిగాయి. ఈ ఫస్ట్ క్వార్టర్లో TCS సంస్థ 9 వేల 279 మందిని రిక్రూట్ చేసుకుంది. విప్రో 888 మందిని రిక్రూట్ చేసుకుంది. టెక్ మహీంద్రా, HCLTech ఐటీ సంస్థలు కొత్తగా ఉద్యోగులను తీసుకోకపోగా.. భారీగా లేఆఫ్స్ చేశాయి. ఈ ఫస్ట్ క్వార్టర్లో టెక్ మహీంద్రాలో 863 మంది ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం పడింది. HCLTech అయితే ఏకంగా 3 వేల 292 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసింది.