మోటరోలా నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్.. జూలై 15న లాంచ్.. పవర్‌ఫుల్ AI ఫోన్ వచ్చేస్తోంది..!

మోటరోలా నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్.. జూలై 15న లాంచ్.. పవర్‌ఫుల్ AI ఫోన్ వచ్చేస్తోంది..!

పెద్ద బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, సూపర్ AI ఫీచర్లతో వస్తున్న మోటరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ ఫోన్ భారతదేశంలో జూలై 15న మధ్యాహ్నం లాంచ్ కానుంది. ఇది ఫోన్ లాంచ్ అయిన తేదీ నుండి మీరు దీనిని ఫ్లిప్‌కార్ట్ లో బుక్ చేసుకోవచ్చు. కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్ కొన్ని ఫీచర్స్ ఫ్లిప్‌కార్ట్ పేజీలో వెల్లడించింది.

ప్రస్తుతానికి ఈ ఫోన్ డిజైన్, స్క్రీన్, ప్రాసెసర్, కూలింగ్ సిస్టమ్, బ్యాటరీ వివరాలు మాత్రమే బయటికి వచ్చాయి. అయితే, ఫోన్ ధర ఎంత ? కెమెరాలు ఎలా ఉంటాయి ? అనే విషయాలను మాత్రం విడుదల రోజునే ప్రకటించనున్నారు.

డిజైన్ & లుక్
ఈ కొత్త ఫోన్ చాలా సన్నని అంచులతో ఫ్లాట్ స్క్రీన్‌తో వస్తోంది. వెనుక వైపు చతురస్రాకారంలో కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను లైట్ బ్లూ, గ్రీన్ రంగుల్లో చూపించారు. ఫోన్ బరువు ఎక్కువగా లేకుండా, చేతిలో పట్టుకుంటే ప్రీమియం లుక్ వచ్చేలా మోటరోలా దీనిని డిజైన్ చేసింది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్ & AI ఫీచర్లు
 ఇందులో క్వాల్‌కామ్ సంస్థకు చెందిన లేటెస్ట్  స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 (Snapdragon 8 Gen 5) ప్రాసెసర్‌ను వాడారు. పాత మోడళ్లతో పోలిస్తే దీని AI పర్ఫార్మెన్స్ 46% పెరిగింది. ఫోన్ లోపలే AI పనులు వేగంగా జరుగుతాయి. ఇందులో 12GB వరకు భారీ ర్యామ్ సపోర్ట్ ఉంది. దీని యాన్‌టూటూ (AnTuTu) స్కోరు 3 మిలియన్ల కంటే ఎక్కువ. కాబట్టి ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుంది.

ALSO READ : కార్పొరేట్ ఉద్యోగి నుంచి పోర్టర్ రైడర్ వరకు..

స్క్రీన్ & గేమింగ్ 
గేమ్స్ ఆడేవారికి, వీడియోలు చూసేవారికి ఈ ఫోన్ స్క్రీన్ చాలా బాగా నచ్చుతుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ క్వాడ్-HD+ స్క్రీన్‌తో వస్తోంది. ఫోన్ స్క్రీన్ సైజు 6.82 ఇంచులు ఉండవచ్చని అంచనా.

స్క్రీన్ ప్రత్యేకతలు:

*ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 7,000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఉంటుంది.
*స్క్రీన్ పగలకుండా 'కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i' ప్రొటెక్షన్ ఇచ్చారు.
*డిస్‌ప్లే క్వాలిటీ చూస్తే 95.12% స్క్రీన్-టు-బాడీ రేషియో, 10-బిట్ కలర్స్‌తో రంగులు చాలా రియలిస్టిక్‌గా కనిపిస్తాయి.
*గేమింగ్ కోసం BGMI వంటి భారీ గేమ్స్‌ను 120fps స్పీడ్‌తో ఎలాంటి లాగ్ లేకుండా ఆడుకోవచ్చు.

హీటింగ్ కంట్రోల్ & పెద్ద బ్యాటరీ
*గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా AI ఫీచర్లు వాడుతున్నప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండటం కోసం ఇందులో 5,500 sq.mm పెద్ద వేపర్ ఛాంబర్‌తో కూడిన 'ఆర్కిటిక్‌మెష్' సిస్టమ్‌ను పెట్టారు.
*ఇందులో 7,100mAh బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 58 గంటల వరకు వస్తుందని కంపెనీ చెబుతున్నారు.
*దీనికి 90W టర్బోపవర్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే, ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ (Magnetic Wireless Charging) సపోర్ట్‌ను కూడా ఇస్తున్నారు.

అయితే దీని ధర, కెమెరా క్వాలిటీ ఇంకా లాంచ్ ఆఫర్ల పూర్తి వివరాల కోసం జూలై 15 వరకు వేచి చూడాల్సిందే!