హీరో విడా ఎలక్ట్రిక్ బైక్ కొత్త వేరియంట్ విడుదల.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 187 కి.మీ రేంజ్..!

హీరో విడా ఎలక్ట్రిక్ బైక్ కొత్త వేరియంట్ విడుదల.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 187 కి.మీ రేంజ్..!

హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ విడాVX2 Plusకు కొత్త వేరియంట్ ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1లక్షా50వేల990. ఈ కొత్త వేరియంట్‌లో 4.4kWh పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్‌ చేస్తే 187 కి.మీ వరకు ప్రయాణించొచ్చు. 

ఈ బ్యాటరీ ప్యాక్‌లో 2.2kWh కెపాసిటీ గల రెండు రిమూవబుల్ బ్యాటరీలు ఉన్నాయి. ఈ బ్యాటరీలను సులభంగా తీసి విడిగా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే, ఈ వేరియంట్‌తో 1kW ఫాస్ట్ పోర్టబుల్ ఛార్జర్ ను కూడా కంపెనీ అందిస్తోంది. పాత 3.4kWh వేరియంట్ లో 580W ఛార్జర్ మాత్రమే లభిస్తుంది.

చార్జింగ్ విషయానికి వస్తే.. 3 గంటల 17 నిమిషాల్లో 4.4kWh బ్యాటరీని 80శాతం, 5 గంటల 8 నిమిషాల్లో 100శాతం ఛార్జ్ అవుతుంది.

బ్యాటరీ మినహా స్కూటర్‌లో ఇతర మెషినరీ మార్పులు లేవు. ఇందులో అదే 6kW ఎలక్ట్రిక్ మోటార్ కొనసాగుతోంది. అయితే టాప్ స్పీడ్ 90 kmphకు పెరిగింది. స్కూటర్‌లో Eco, Ride, Sport రైడింగ్ మోడ్‌లతో పాటు, వేగంగా యాక్సిలరేషన్ కోసం Boost Mode కూడా అందుబాటులో ఉంది.

కొత్త విడాVX2 Plus 4.4kWh వేరియంట్ 2026 జూలై చివరి నాటికి దేశవ్యాప్తంగా షోరూమ్‌లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.