హైదరాబాద్: గత 20 రోజులుగా తెలంగాణ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన టీజీ20 లీగ్ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం (జులై 12) హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న టైటిల్ ఫైట్‌లో అన్విత ఖమ్మం ఏసెస్, హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఖమ్మం తొలుత బౌలింగ్ చేయనుంది.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమ ఉజ్జీవులుగా ఉండటంతో ఫైనల్లో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. తమ తమ చివరి మ్యాచుల్లో అద్భుత విజయాలు సాధించిన ఇరు జట్లు టైటిల్ ఫైట్‌లోనూ విజయఢంకా మోగించి టీజీ20 లీగ్ ఫస్ట్ ఎడిషన్ విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇక, ఫైనల్ మ్యాచ్‌కు ముందు స్టేడియంలో టీజీ20 టోర్నీ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ క్లోజింగ్ సెర్మనీలో పాల్గొని సందడి చేశాడు.
