టాలీవుడ్ బ్యూటీ సమంత ఫుల్ జోష్ లో ఉంది. లేటెస్ట్ గా ఆమె నటించిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. జూన్ 19, 2026న విడుదలైన ఈ మూవీ .. 24 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లను రాబట్టింది. టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రంగా అరుదైన భారీ రికార్డును సమంత సొంతం చేసుకుంది.
రూ. 100 కోట్ల క్లబ్ లోకి...
ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సందర్భంగా సమంత తెగ సంబరపడిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది. ఒకవైపు త్వరలోనే తల్లి కాబోతుండటం.. మరో వైపు తన మూవీ గ్రాండ్ సక్సెస్ తో ఫుల్ ఖుషిలో ఉంది. ఇప్పడు థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ యాక్షన్ డ్రామా, ఓటీటీ ప్రియులను అలరించేందుకు డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేస్తోంది. మేకర్స్ ఈ సినిమా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయడంతో అటు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Our Bangaaram @Samanthaprabhu2's reaction to 100 CRORES is just adorable ❤️#MaaIntiBangaaram crosses 100 CRORES GROSS WORLDWIDE
— Prathyangira Cinemas (@PrathyangiraUS) July 12, 2026
The FIRST EVER FEMALE-LED TELUGU FILM to hit this milestone ❤🔥
Overseas By @PrathyangiraUS pic.twitter.com/ur5nD9SWyo
జియోహాట్‌స్టార్‌లో హంగామా..
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) భారీ ధరకే సొంతం చేసుకుంది. జూలై 17, 2026 నుంచి ఈ చిత్రం అఫీషియల్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే ప్రీమియర్‌కు లాక్ చేయబడింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధించిన ఘన విజయం చూస్తుంటే.. త్వరలోనే మిగిలిన దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇండస్ట్రీ టాక్.
బాక్సాఫీస్ దాటి.. ఓటీటీ లోకి!
సమంత తన సొంత బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పై నిర్మించిన ఈ చిత్రానికి తన భర్త, బాలీవుడ్ క్రియేటివ్ మైండ్స్ రాజ్ నిడిమోరు కథను అందించగా, నందినీ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచింది. థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న 'మా ఇంటి బంగారం'.. ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని చూసేందుకు ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. థియేటర్లలో టికెట్ల అమ్మకాలతో ఇంకా స్ట్రాంగ్‌గా రన్ అవుతున్న ఈ సినిమా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఎలాంటి వ్యూస్ రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.
July 17th
— JioHotstar Telugu (@JioHotstarTel_) July 12, 2026
Okokkodni kodathamu chudu... Prematho abbaaa ❤️🔥#MaaIntiBangaaram streaming from July 17th on JioHotstar! 💫 #MaaIntiBangaaramOnJioHotstar@Samanthaprabhu2 @TralalaPictures #RajNidimoru #NandiniReddy @himankd @gulshandevaiah @diganthmanchale @gautamitads… pic.twitter.com/0pgDLow1n4
