ప్రపంచంలోనే తొలి రోబో పెళ్లి.. వరుడు రాబర్ట్.. వధువు మటిల్డా.. ఉంగరాలు తెచ్చింది రోబో కుక్క..!

ప్రపంచంలోనే తొలి రోబో పెళ్లి.. వరుడు రాబర్ట్.. వధువు మటిల్డా.. ఉంగరాలు తెచ్చింది రోబో కుక్క..!

 ప్రపంచంలోనే మొదటిపెళ్లి.. ఇంతకుముందుకు ఇలాంటి పెళ్లి ఎక్కడా చూసి ఉండరు. పెళ్లి అంటే వరుడు, వధువు, బంధుమిత్రులు, పెళ్లి ప్రమాణాలు..వెడ్డింగ్ రిసెప్షన్, దావత్ ఇవన్నీ ఉన్నాయి. గ్రాండ్ గానే చేశారు. అయితే ఈ పెళ్లిలో పెళ్లి చేసుకున్నది మనుషులు కాదు.. రెండు హ్యూమనాయిడ్ రోబోలు. ప్రపంచంలోనే తొలి రోబో పెళ్లి జరిపించారు. ఈ వినూత్న వేడుక రష్యా రాజధాని మాస్కోలోని పుష్కిన్ లైబ్రరీలో జరిగింది.

ఈ వేడుకలో రాబర్ట్ అనే రోబో వరుడిగా, మటిల్డా అనే రోబో వధువుగా పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు. ఆఫీస్ ఉద్యోగి,బ్లాగర్  అయిన  రాబర్ట్, బ్యాలెరినా(డాన్సర్) అయిన మటిల్డాలు  ఒకే ఏజ్.. మంచి కోఆర్డినేషన్ తో పనిచేస్తున్నారట. ఇదంతా గమనించిన నిర్వాహకులు వీరిని భార్యాభర్తలుగా చేయాలని నిర్ణయించుకొని ఈ పెళ్లి చేశారట. 

ఈ పెళ్లిలో మరో ప్రత్యేక ఆకర్షణ 'డాగ్మాటిక్' అనే రోబో కుక్క. ఇదే పెళ్లి ఉంగరాలను తీసుకొచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. నిజమైన పెళ్లి మాదిరిగానే రోబోలకు స్పెషల్ వెడ్డింగ్ డ్రెస్సులు వేసి, పెళ్లి ప్రమాణాలు చేయించి వేడుకను నిర్వహించారు.

అయితే ఇది చట్టబద్ధమైన వివాహం కాదని నిర్వాహకులు స్పష్టం చేశారు. రోబోలకు మానవుల మాదిరిగా భావోద్వేగాలు ఉన్నాయని చెప్పడం తమ ఉద్దేశం కాదన్నారు. హ్యూమనాయిడ్ రోబోటిక్స్‌లో వచ్చిన టెక్నాలజీ డెవలప్ మెంట్ ను ప్రజలకు చూపించడమే ఈ ప్రోగ్రాం లక్ష్యంగా నిర్వాహకులు చెప్పారు.  

ఈ వెరైటీ ప్రోగ్రామ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు దీనిని ఫ్యూచర టెక్నాలజీకి శాంపిల్ గా  ప్రశంసిస్తుండగా, మరికొందరు ప్రమోషన్  ఈవెంట్ గా అభివర్ణించారు. ఏదేమైనా, ప్రపంచంలోనే తొలి రోబో పెళ్లి మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ,రోబోటిక్స్ ఫ్యూచర్ పై కొత్త చర్చకు తెరలేపింది.