మంత్రి వివేక్ ఆదేశాలతో బోర్వెల్ ఏర్పాటు..ఆలయం వద్ద తీరిన నీటి సమస్య

మంత్రి వివేక్ ఆదేశాలతో బోర్వెల్ ఏర్పాటు..ఆలయం వద్ద తీరిన నీటి సమస్య

కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రిలోని 24వ వార్డు ఊరుమందమర్రి పోచమ్మ తల్లి ఆలయం వద్ద నిర్మించిన బోర్​వెల్​ను గురువారం కాంగ్రెస్ లీడర్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రెసిడెంట్​బండి సదానందం యాదవ్​ప్రారంభించారు.

ఆలయం వద్ద నీటి సౌకర్యం లేకపోవడం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సదానందం యాదవ్ ఇటీవల మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన వారు కొత్త బోర్​వెల్​ఏర్పాటు చేయాలని మున్సిపల్ ఆఫీసర్లను ఆదేశించారు. పోచమ్మ తల్లి ఆలయం వద్ద నీటి సమస్యను తీర్చిన మంత్రి, ఎంపీకి 24వ వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి కృషితో రోడ్డు పనులు ప్రారంభం

చెన్నూరు మున్సిపాలిటీ లోని రెండో వార్డులో రూ.22.50 లక్షలతో సీసీ రోడ్డు పనులు గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ ఆధ్వర్యంలోప్రారంభించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు చైర్​పర్సన్​ తెలిపారు. వార్డు కౌన్సిలర్లు ఎ.శంకర్, సుశీల్ కుమార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.