జీడిమెట్ల, వెలుగు: ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన పేట్బషీరాబాద్పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నానికి చెందిన బేరి నర్సింహులు(35) బతుకుదెరువు కోసం కొంపల్లికి వచ్చాడు. ఇక్కడ లేబర్ గా పనిచేస్తూ ఫైఓవర్కింద నిద్రించేవాడు. బుధవారం రాత్రి ఓ వ్యక్తి తాగిన మత్తులో నర్సింహులుతో గొడపడ్డాడు.
అనంతరం అతన్ని కర్రతో కొట్టి చంపేశాడు. గురువారం ఉదయం ఫ్లైఓవర్నర్సింహులు మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కూలీ డబ్బుల విషయంలో వచ్చిన గొడవ హత్యకు దారి తీసి ఉంటుందని భావిస్తున్నామన్నారు. కేసు నమోదు చేశామని, హంతకుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
