రేగొండ, వెలుగు: భూముల రీసర్వేతో భూ సమస్యల పరిష్కారం దొరుకుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం రేగొండ మండలం జగ్గయ్యపేట, గోరికొత్తపల్లి గ్రామాల్లోని భూముల రీ సర్వేపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆర్డీవో హరికృష్ణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోనే భూముల రీ సర్వే కోసం ఈ గ్రామాలను పైలెట్ ప్రాజెక్ట్ ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ హేమలత, మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, సర్పంచ్ శంకర్ పాల్గొన్నారు.
