గుండె జబ్బులు ఉన్నవాళ్లు తమ సినిమా చూసేందుకు రావొద్దు అని ఎస్‌కే బషీద్ హెచ్చరిస్తున్నారు. కొత్త నటీనటులతో ఆయన దర్శకత్వంలో రూపొందిన హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆమెన్’. ఈ నెల 24న సినిమా విడుదల కాబోతోంది. ఎస్‌బీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై రేగుల నీరజరాణి సమర్పణలో బషీద్ నిర్మించారు.
సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సరికొత్త సస్పెన్స్, భయానక ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాం. ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాల ట్రెండ్‌ను పూర్తిగా మార్చేలా టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో రూపొందించాం. థియేటర్‌లో సినిమా ఎంతలా భయపెడుతుందో చెప్పలేం కనుక గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్‌కు రావొద్దని తెలియజేస్తున్నాం’ అని అన్నారు.
