హుషారు పిట్టలు టీజర్ చూసి తప్పుగా అర్థం చేసుకున్నారు: వెంకట్‌‌ యాదవ్‌‌ 

హుషారు పిట్టలు టీజర్ చూసి తప్పుగా అర్థం చేసుకున్నారు: వెంకట్‌‌ యాదవ్‌‌ 

అన్షు, వాసవి గణేషన్‌‌ జంటగా బిక్షు దర్శకత్వంలో వెంకట్‌‌ యాదవ్‌‌ నిర్మిస్తున్న చిత్రం ‘హుషారు పిట్టలు’. ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది. ఏషియన్‌‌, సురేష్‌‌ ఫిలింస్‌‌ సంస్థలు విడుదల చేస్తున్నాయి. బుధవారం ఈ చిత్రం నుంచి ‘టోంగా టోంగా’ అనే పాటను విడుదల చేశారు.  ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌కు నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌‌ ముఖ్యఅతిథిగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు.  నిర్మాత వెంకట్‌‌ యాదవ్‌‌ మాట్లాడుతూ ‘టీజర్‌‌‌‌ రిలీజ్ తర్వాత సినిమాలో కంటెంట్‌‌ ఏమిటో తెలియక చాలామంది బ్యాడ్‌‌ కామెంట్లు పెట్టారు. అన్నిరకాల ఎమోషన్స్‌‌తో అందరి హృదయాలకు హత్తుకునే సినిమా ఇది. 

సురేష్‌‌బాబు గారు సినిమాను విడుదల చేస్తున్నారంటే ఇది ఎలాంటి సినిమానో అర్థం చేసుకోవచ్చు. థియేటర్‌‌‌‌లో ప్రేక్షకులు ఓ మంచి సినిమా చూశామన్న అనుభూతికి లోనవుతారు’ అని చెప్పారు. ఈ సినిమా ట్రెండ్‌‌ సృష్టించబోతుందని దర్శకుడు బిక్షు చెప్పాడు. టీజర్ చూసి అందరూ మిస్‌‌ అండర్‌‌స్టాండింగ్‌‌ చేసుకుంటున్నారని, ఆఫ్టర్‌‌‌‌ రిలీజ్ అందరి ఆలోచన మారుతుందని హీరోహీరోయిన్స్‌‌ చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ చరణ్‌‌ అర్జున్‌‌, గోవర్థన్‌‌, నవీన్‌‌, అంజి, డీఓపీ రుద్రసాయి, లిరిసిస్ట్​ ఎస్‌‌.ఎస్‌‌.చిరంజన్‌‌ తదితరులు పాల్గొన్నారు.