రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా అనిల్ బోయిడపు దర్శకత్వంలో కె నిహారిక దాసరి నిర్మించిన చిత్రం ‘రాజా ది రాజా’. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జులై 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రుత్విక్ మాట్లాడుతూ.. ‘మనసులో చాలా ఎక్సయిట్‌మెంట్ ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసిన నా కల నెరవేరుతోంది. ఇప్పటికే ప్రీమియర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది మంచి విజువల్ స్పెక్టికల్. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని అన్నాడు.
ఇది చాలా హార్ట్‌ఫుల్ ఫిల్మ్ అని హీరోయిన్ విశాఖ ధిమాన్ చెప్పింది. ఈ చిత్రంలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలిస్తాయని దర్శకుడు అనిల్ బోయిడపు అన్నాడు. ప్రీమియర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, సినిమాకు కూడా అలాంటి ఆదరణే దక్కుతుందని నిర్మాత కె. నిహారిక దాసరి అన్నారు. టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.
