చంద్రుగొండ: మందు తాగొస్తున్నాడు..ఈ టీచర్ మాకొద్దు

చంద్రుగొండ: మందు తాగొస్తున్నాడు..ఈ టీచర్ మాకొద్దు

చంద్రుగొండ, వెలుగు : మందు తాగి స్కూల్‌‌‌‌‌‌‌‌కు వస్తున్న టీచర్ రాజేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాకొద్దంటూ గురువారం మద్దూకూరు జడ్పీ స్కూల్ స్టూడెంట్స్ ఆందోళన చేశారు. ఆరో తరగతిలో ఫిజిక్స్ క్లాస్ చెప్పేందుకు వెళ్లగా స్టూడెంట్స్ బయటకు వచ్చి స్కూల్ ముందు బైఠాయించారు. 

రాజేశ్‌‌‌‌‌‌‌‌కుమార్ విధులకు సరిగ్గా రావట్లేదని, మందు తాగి స్కూల్‌‌‌‌‌‌‌‌కి వస్తున్నాడని స్టూడెంట్స్ తెలిపారు. పై ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తానని హెచ్‌‌‌‌‌‌‌‌ఎం భవాని హామీ ఇవ్వడంతో స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ ఆందోళన విరమించారు.