ఇబ్రహీంపట్నం, వెలుగు : బిల్డింగ్‌పై నుంచి దూకి ఓ బీటెక్ స్టూడెంట్ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్జిల్లా కురవి మండలం రాజోలుకు చెందిన విట్టల వాసుదేవ్(20) ఇబ్రహీంపట్నంలోని సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ (సీఎస్సీ) సెకండ్ఇయర్చదువుతున్నాడు. ఎంబీఆర్‌నగర్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటున్నాడు. గురువారం రాత్రి తానుండే బిల్డంగ్మూడో అంతస్తు పైకి ఎక్కి దూకాడు. తీవ్రంగా గాయపడడంతో దవాఖానకు తరలిస్తుండగా కన్నుమూశాడు. కారణాలు ఏమిటనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు.
